న్యాయ వ్యవస్థ, చట్టాలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-10-24T06:57:25+05:30 IST

న్యాయ వ్యవస్థ, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి అప్పల నర్సింహమూర్తి అన్నారు.

న్యాయ వ్యవస్థ, చట్టాలపై అవగాహన అవసరం
చట్టాలపై అవగాహన కల్పిస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి అప్పల నర్సింహమూర్తి

మేళ్లచేర్వు, అక్టోబరు 23: న్యాయ వ్యవస్థ, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి అప్పల నర్సింహమూర్తి అన్నారు. మేళ్లచేర్వు పంచాయతీ కార్యాలయంలో జరిగిన న్యాయ విజ్ఘాన సదస్సులో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థపై అవగాహన ఉన్నప్పుడే ప్రజలు సరైన రక్షణ పొందవచ్చనే భావన కలుగుతుందని తెలిపారు. చట్టం ఏవరికీ చుట్టం కాదు అని, చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. తప్పు చేసి చేసిన తప్పు తనకు తెలియదు అంటే చట్టం ఒప్పుకోదన్నారు. తప్పని సరిగా శిక్ష పడుతుందన్నారు. భారత రాజ్యాంగంలో న్యాయ, కార్యనిర్వాహక శాసన శాఖలున్నాయని, వాటిలో న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగిందని పేర్కొన్నారు. పై రెండు శాఖలకు సంబంధించిన అధికారులు ఇతరులు ఎవరైనా కోర్టు పరిధిలో ప్రతివాధిగా ఉంటే అందరి మాదిరిగానే పరిగణిస్తామన్నారు. న్యాయం కోసం వచ్చే పేదలకు తమ తరపున న్యాయ వాదులను తెచ్చుకోనే స్థోమత లేకుంటే మండల స్థాయిలోని న్యాయసేవసంస్థకు వినతి పత్రం అందిస్తే కోర్టు న్యాయవాధిని నియమిస్తుందన్నారు.చట్టాలపై అవగాహన కల్పించడమే సదస్సుల ప్రధాన ఉద్దేశమన్నారు. ధరణి, కొత్త రెవెన్యూ చట్టాలు, ట్రైబ్యునల్‌ తదితర అంశాలను ఆర్డీవో వెంకారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దామోదార్‌, ఎంపీడీవో ఇస్సాక్‌హుస్సేన్‌, ఎంపీపీ కొట్టెపద్మసైదేశ్వరావు, ఏజిపివిజికె మూర్తి, బార్‌ అసోషియేషన్‌ అధికార ప్రతినిధి కాల్వశ్రీనివాసరావు,  పానల్‌ అడ్వకేట్‌ కమతం నాగార్జున, సర్పంచ్‌ శంకర్‌రెడ్డి, న్యాయవాదులు క్రిష్ణయ్య, రమణారెడ్డి, వెంకటేశ్వర్లు, సైదాహుస్సేన్‌, రామలక్ష్మారెడ్డి, అధికారులు, న్యాయవాదులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-24T06:57:25+05:30 IST