సీఎంకు ఎన్నికలపై ఉన్న ప్రేమ రైతులపై లేదు

ABN , First Publish Date - 2020-10-28T11:02:15+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికపై ఉన్న ప్రేమ రైతులపై లేదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శించారు

సీఎంకు ఎన్నికలపై ఉన్న ప్రేమ రైతులపై లేదు

పంటనష్టాన్ని సీఎం ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించాలి

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ డిమాండ్‌ 

యానంపల్లిలో దెబ్బతిన్న పంటల పరిశీలన


నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 27: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికపై ఉన్న ప్రేమ రైతులపై లేదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శించారు. జిల్లాలో అకాల వర్షాల వల్ల, దోమపోటు వల్ల నష్టపోయిన వరి పంటలను మంగళవారం ఆయన డిచ్‌పల్లి మండలం యానంపల్లిలో జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరి పంటకు నష్టం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే చేసి రైతులను ఆదుకోవాల్సి న అవసరం ఉందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారని, వారు తిరగాల్సింది దుబ్బాకలో కాదని గ్రామాలో అని అన్నారు. వరితో పాటు పత్తి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నా రు. తడిసిన వరి, మొక్కజొన్న, సోయాబీన్‌, పప్పు దిను సుల పంటలును కొనుగోలు చేసి ఇట్టి పంట లకు మ ద్దత ధర ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రా ష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఆయన వెంట పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్‌, అధికార ప్రతినిధులు వినోద్‌కుమా ర్‌, నాయకుడు మోహన్‌దాస్‌, రాజశేఖర్‌, రాజేశ్వర్‌, ప్రతాప్‌రెడ్డి, మంతెన గంగన్న, కార్తీక్‌, ల వంగ రాజు, శంకర్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-28T11:02:15+05:30 IST