Viral Video: వావ్! ఈ బుడ్డోడి టాలెంటే వేరు.. ఎంత బాగా మ్యాజిక్ చేశాడో చూడండి..

Published: Thu, 30 Jun 2022 21:32:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: వావ్! ఈ బుడ్డోడి టాలెంటే వేరు.. ఎంత బాగా మ్యాజిక్ చేశాడో చూడండి..

కొందరు పిల్లలకు చిన్న వయసులోనే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. పెద్దవారు కూడా చేయలేని పనులను అవలీలగా చేసేస్తుంటారు. కొందరు పిల్లలు అతి చిన్న వయసులోనే పెద్ద వారికి కూడా చదువు నేర్పించేంత పరిజ్ఞానం కలిగి ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు చాలా దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. ఓ బుడ్డోడు చేసిన మ్యాజిక్.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ బుడ్డోడు పాఠశాలలో చేసిన మ్యాజిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్కూల్లో తోటి విద్యార్థుల ముందు మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతాడు. ఎలా చేస్తాడో అని అంతా ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇంతలో రెండు రాళ్లను రెండు చేతుల్లో పట్టుకుని చూపిస్తాడు. వాటిని బెంచి మీద చేతులతో బోర్లిస్తాడు. తర్వాత చెండు చేతులను తీసేస్తే.. విచిత్రంగా రెండు రాళ్లు ఒకే దగ్గర కనిపిస్తాయి. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుందీ మ్యాజిక్. అంత చిన్న వయసులో అందరినీ ఆశ్యర్యపరిచేలా మ్యాజిక్ చేసిన ఈ బుడ్డోడిని.. నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. వావ్! ఇంత చిన్న వయసులో ఎంత టాలెంట్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 విమానం ఎక్కాక షాకింగ్ ట్విస్ట్.. బ్యాగ్‌ను చెక్ చేయాలన్న సిబ్బంది.. భయపడుతూనే ఆ యువతి వెళ్తే..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఓ కర్రకు దుప్పటిని కట్టి.. అనారోగ్యంతో ఉన్న 75 ఏళ్ల తల్లిని అందులో పడుకోబెట్టి.. 5 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి..!Viral Video: చనిపోయిన తండ్రి పాత దుస్తులను.. మధుర జ్ఞాపకంగా మార్చిన కూతురు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..videoInstagram Reel తెచ్చిన తంటా.. సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి వీడియో చేస్తే దూల తీర్చేసిన పోలీసులు..!భర్త చనిపోయిన నెల తర్వాత.. ఓ భార్య షాకింగ్ నిర్ణయం.. నా కూతుర్ని నువ్వే చూసుకో అంటూ లేఖలో తల్లికి రాసి మరీ..పెరుగు తేవడానికి వెళ్లిన భర్త.. ఇంటికి చేరుకునేలోపు లోపలి నుంచి కటింగ్ మిషన్ శబ్ధాలు.. తీరా కిటికీ తలుపు తీసి చూస్తే..ఐదో అంతస్తు ఎక్కి.. చిట్టచివరన కూర్చుని దూకేస్తానంటూ భార్య బెదిరింపులు.. పోలీసులు వచ్చి కారణం అడిగితే ఆమె చెప్పింది విని..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.