Viral Video: ఈ వ్యక్తి చక్కెర ప్యాకెట్‌తో ఎంత చక్కగా మ్యాజిక్ చేశాడు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2022-02-28T02:58:40+05:30 IST

కొందరు చేసే మ్యాజిక్ చూస్తే.. వీళ్లకేమన్నా అతీత శక్తులేమన్నా ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. అంత రియాలిటీగా ఉంటుంది.. కొందరు చేసే మ్యాజిక్‌. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో..

Viral Video: ఈ వ్యక్తి చక్కెర ప్యాకెట్‌తో ఎంత చక్కగా మ్యాజిక్ చేశాడు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

కొందరు చేసే మ్యాజిక్ చూస్తే.. వీళ్లకేమన్నా అతీత శక్తులేమన్నా ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. అంత రియాలిటీగా ఉంటుంది.. కొందరు చేసే మ్యాజిక్‌. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూశాం. వస్తువులను, మనుషులను మాయం చేసినట్లు, శూన్యం నుంచి ఉన్నట్టుండి వింత వింత వస్తువులను సృష్టించడం తదితర మ్యాజిక్ వీడియోలు చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వ్యక్తి చిన్న చక్కెర ప్యాకెట్‌తో చేసిన మ్యాజిక్.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చక్కెర ప్యాకెట్ పట్టుకుని వస్తాడు. దాన్ని చించేసి, అందులోని చక్కెరను ఓ చేతిలో పోస్తాడు. అది చేతి వేళ్ల మధ్య నుంచి కిందపడిపోతుంది. తర్వాత చేతులను విదిలించి చూపిస్తే.. చక్కెర ఎక్కడా కనిపించదు. తర్వాత కుడి చేయిని శూన్యంలో కొద్దిసేపు ఉంచి.. ఏదో పట్టుకున్నట్లు చూపిస్తాడు. తర్వాత యథావిధిగా కిందపడిన చక్కెరను మొత్తం ఎడమ చేతిలో పోస్తాడు. కిందపడిన చక్కెర మళ్లీ ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాదు. చూడ్డానికి మాత్రం ఏదో మంత్రం చేసినట్లు ఉంటుంది. దీనిపై నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైలట్‌గా మారిన రెండేళ్ల బాలుడు.. అసలు ఇది ఎలా సాధ్యమైందంటే..





Updated Date - 2022-02-28T02:58:40+05:30 IST