Advertisement

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

Mar 6 2021 @ 00:12AM

బంట్వారం (కోట్‌పల్లి): ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కోట్‌పల్లి మండల పరిధిలోని బార్వాద్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గెంటి మల్లేషం(35) తన పొలం పక్కన మరో పొలంలో గురువారం బోరు వేస్తుండటంతో అక్కడికి చూసేందుకు వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బావిలో పడి మునిగిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామస్థుడు గెంటి వెంకటయ్య బావిలో చూసేసరికి ఆయన శవమై కనిపించడంతో వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తన భర్త మృతిపై అనుమానం ఉందని మృతుడి భార్య తెలపడంతో పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో వివరాలు సేకరించారు. మృతుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధారూరు సీఐ తిరుపతిరాజు, కోట్‌పల్లి ఎస్‌ఐ వెంకటనారాయణ తెలిపారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం కుటుంబసభ్యులకు అందజేస్తామని పోలీసులు తెలిపారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Follow Us on:
Advertisement