బొబ్బిలి, జనవరి 16: పట్టణ పరిధిలోని కంచరవీధిలోగల బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ ప్రసాదరావు కథనం ప్రకారం.. కంచర వీధికి చెందిన కాకినాడ జగదీశ్వరరావు (38) శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు బావిలో పడిపో యారు. శనివారం ఉదయం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్సీకి తరలించారు. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. జగదీశ్వరరావు చిన్నపాటి వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. ఈయనకు మూడు పెళ్లులు జరగ్గా, ముగ్గురు భార్యలకూ విడాకులిచ్చాడు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు ఉన్నారు.