విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-07T06:02:48+05:30 IST

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన పట్టణంలో గురువారం జరిగింది.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

చండూరు, మే6: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన  పట్టణంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం.. పట్టణానికి చెందిన యాదగిరాచారి(60) ఇంటి ముందు ఏపుగా పెరిగిన కానుగు చెట్టు కొమ్మలు నరికేందుకు ఎక్కాడు. అతడు కొట్టిన కొమ్మ తెగి మె యిన లైనపై పడింది. దీంతో యాదగిరాచారి షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతడిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


తాటిచెట్టు నుంచి పడి గీత కార్మికుడి మృతి
నకిరేకల్‌, ఏప్రిల్‌ 6 : మునిసిపాలిటీలోని ఏడో వార్డుకు చెందిన గీత కార్మికుడు సమ్మెట రామచంద్రు(55) ప్రమాదవశాత్తు గురువారం తాటిచెట్టు నుంచి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే వేముల వీరే శం, నకిరేకల్‌ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కొండ జానయ్యగౌడ్‌ సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.


ఐదుగురి అరెస్ట్‌, రిమాండ్‌
వేములపల్లి, మే 6 :
రోడ్డు ప్రమాదంలో వేములపల్లికి చెందిన దైద లక్ష్మమ్మ మృతిని నిరసిస్తూ అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై ధర్నా నిర్వహించి రాకపో కలకు అంతరాయం కలిగించిన ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు త రలించినట్లు ఎస్‌ఐ డి.రాజు తెలిపారు. స్థానిక పోలీ్‌సస్టేషనలో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై సెక్షన 143, 341, ఆర్‌డబ్లు 149 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారిని 14రోజులపాటు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఇకపై ఎవరైనా రహదారులను దిగ్భందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


గడ్డి ట్రాలీ దగ్ధం
చిట్యాల, మే6 :
విద్యుత తీగలు తాకి గడ్డిలోడు దగ్ధమైంది. చిట్యాలకు చెందిన ఆగు వెంకన్న రామన్నపేట మండలం నీర్నెంల గ్రామం నుంచి గురువారం ట్రాక్టర్‌లో గడ్డి తెస్తుండగా చిట్యాల ముత్యాలమ్మ గుడి వద్ద విద్యుత వైర్లు తాకి మంటలు రేగాయి. డ్రైవర్‌ చాకచక్యంగా ట్రాక్టర్‌ను ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి  ఇంజన నుంచి ట్రాలీని వేరుచేశాడు. దీంతో ట్రాలీలో ఉన్న గడ్డి పూర్తిగా ద గ్ధమై ట్రాలీ పాక్షికంగా దెబ్బతింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు.

Updated Date - 2021-05-07T06:02:48+05:30 IST