అతడి కాంటాక్ట్ లిస్ట్‌లో 150 మంది మహిళల పేర్లు.. నంబర్ సేకరించి రోజూ చాటింగ్.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-08T14:02:03+05:30 IST

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉంటాయి. ఇంట్లో కూర్చునే న్యాయంగా లక్షలు సంపాదించే వాళ్లు ఉన్నారు. అలాగే...

అతడి కాంటాక్ట్ లిస్ట్‌లో 150 మంది మహిళల పేర్లు.. నంబర్ సేకరించి రోజూ చాటింగ్.. చివరకు ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉంటాయి. ఇంట్లో కూర్చునే న్యాయంగా లక్షలు సంపాదించే వాళ్లు ఉన్నారు. అలాగే కాలు కదపకుండా లక్షలు లక్షలు దోచుకునే నేరగాళ్లు కూడా ఉంటారు.  ఇక యువతులు, మహిళలకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అపరిచిత వ్యక్తులుగా పరిచయం చేసుకుని, చివరికి అత్యాచారం, హత్యలకు తెగబడడం.. సర్వసాధారణమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి  చేసిన నిర్వాకం... అందరినీ షాక్‌కు గురి చేసింది. మహిళల నంబర్లు సేకరించి.. ఎలాగోలా పరిచయం చేసుకోవడం, తర్వాత వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ వివాహిత నంబర్ సేకరించి.. రోజూ చాటింగ్ చేసేవాడు. లైంగిక సంబంధం పెట్టుకుందామంటూ ఓ రోజు మెసేజ్ పెట్టాడు. చివరికి ఏం జరిగిందంటే..


హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన సచిన్ కుమార్ అనే వ్యక్తి.. ఢిల్లీ పరిధిలోని షహాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న డెయిరీలో పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. కొన్నాళ్లకు ఇతడి బుద్ధి పక్కదారి పట్టింది. ఎలాగైనా మహిళలతో పరిచయం పెంచుకోవాలని నిత్యం ఆలోచించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు కంప్యూటర్ ఆప్లికేషన్ సాయంతో కొందరు మహిళల నంబర్లను సేకరించాడు. ముందుగా వారికి మెసేజ్‌లు పంపి.. తాను ఓ మంచి వ్యక్తిగా పరిచయం చేసుకునేవాడు. అతడి మాయమాటలు నమ్మి.. అవతలి వారు కూడా ఇతడితో చాటింగ్ చేసేవారు. తర్వాత వారి ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో అకౌంట్లకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, వారి ఫొటోలను డౌన్ లోడ్ చేసుకునేవాడు. చివరగా లైంగిక సంబంధం పెట్టుకుందామంటూ వేధించేవాడు. బయట చెబితే పరువు పోతుందనే ఉద్దేశంతో మహిళలు కూడా ఎవరికి చెప్పుకొనేవారు కాదు.

పరాయి మహిళతో పారిపోయేందుకు సిద్ధపడ్డాడు.. అర్ధరాత్రి ఆమెను తీసుకెళ్తుండగా దారి మధ్యలో..


ఈ క్రమంలో ఇటీవల ఓ వివాహితకు కూడా ఇలాగే మెసేజ్ చేసి, పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు చాటింగ్ చేసిన అనంతరం.. ఓ రోజు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ మెసేజ్ చేశాడు. దీంతో అవాక్కయిన మహిళ.. తనకు వివాహమైందని, ఇలాంటి పనులు చేయడం నచ్చదని.. తేల్చి చెప్పింది. అయినా యువకుడు మాత్రం రోజూ మెసేజ్ చేస్తూ వేధించేవాడు. కొన్నాళ్లు ఓపిగ్గా భరించిన ఆమె.. చివరకు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. వారి విచారణలో సచిన్ కుమార్... దాదాపు 150మంది మహిళలను వేధించినట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది. ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది.

ముగ్గురు విద్యార్థులను ఇంటికి పిలిచిన టీచర్.. ప్రియుడిని వీడియో తీయమంటూ ఆమె చేసిన పని..

Updated Date - 2022-04-08T14:02:03+05:30 IST