Bala Saheb Blessings ఏక్‌నాథ్ షిండేకు కాదు

ABN , First Publish Date - 2022-06-30T18:50:58+05:30 IST

మహారాష్ట్ర అధికార కూటమిలో అలజడి నేపథ్యంలో ఓ బ్లాక్ అండ్ వైట్

Bala Saheb Blessings ఏక్‌నాథ్ షిండేకు కాదు

ముంబై : మహారాష్ట్ర అధికార కూటమిలో అలజడి నేపథ్యంలో ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటో వైరల్ అయింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఓ వ్యక్తి నుదుటిపై తిలకం దిద్దుతూ, ఆశీర్వదిస్తున్నట్లు ఈ ఫొటోలో ఉంది. బాల్ థాకరే చేత బొట్టు పెట్టించుకుని, ఆశీర్వాదాలు పొందిన వ్యక్తి శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేయేనని ఈ ఫొటోను పోస్ట్ చేసినవారు చెప్తున్నారు. అయితే ఇది తప్పు అని వెల్లడైంది. 


బాల్ థాకరే చేత బొట్టు పెట్టించుకుంటున్న వ్యక్తి శివసేన నేత ఆనంద్ దిఘే అని నిర్థరణ అయింది. దిఘేపై ఏప్రిల్‌లో బీబీసీ మరాఠీ రాసిన వార్తలో ఈ ఫొటోను పెట్టింది. ఇదే ఫొటో మే నెలలో మరాఠీ దినపత్రిక లోక్‌మత్‌లో ప్రచురితమైంది. దిఘే 2001లో మరణించారు. 2021 ఆగస్టు 26న శివసేన ఇచ్చిన ట్వీట్‌లో దిఘే వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించింది. కొందరు శివసేన నేతలు కూడా ఈ ఫొటోను షేర్ చేశారు. 


ఏక్‌నాథ్ షిండే గురువు ఆనంద్ దిఘే

బాల్ థాకరే అనుచరుడు ఆనంద్ దిఘే. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేకు గురువు దిఘే. మహారాష్ట్రలోని థానేలో మరో బాల్ థాకరేగా ఆయన వ్యవహరించేవారు.  షిండే సొంత పార్టీలో తిరుగుబాటు చేయడంతో దిఘే వార్తల్లోకి వచ్చారు. 


Updated Date - 2022-06-30T18:50:58+05:30 IST