ఆక్రమణలపై కదిలిన యంత్రాంగం

Jun 16 2021 @ 22:58PM
రికార్డులు పరిశీలిస్తున్న ఆర్‌ఐ

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

శృంగవరపుకోట రూరల్‌ : బొడ్డవర పంచాయతీ భవానీనగర్‌ సమీపంలో ఉన్న బొడ్డుబంద చెరువు ఆక్రమణలపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై రెవెన్యూ యంత్రాంగం కదిలింది. చెరువు విస్తీర్ణం గుర్తించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ ఎం.సురేష్‌ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆర్‌ఐ ఇబ్రహీం... వీఆర్‌వో సోమరాజుతో కలిసి చెరువును పరిశీలించారు. సర్వేయర్‌ సెలవులో ఉన్నారని, త్వరలోనే సర్వే చేపట్టి చెరువు హద్దులు గుర్తించి, ఆక్రమణదారులకు నోటీసులు అందిస్తామన్నారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.