కోడూరుకు వెయ్యేళ్ల చరిత్ర

ABN , First Publish Date - 2021-10-24T05:06:09+05:30 IST

మండలంలోని కోడూరు గ్రామా నికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని, ఇక్కడ లభ్యమవుతున్న శిల్పాలే అందుకు సాక్షాలని పురావస్తు పరిశోధకుడు, ప్లచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈ మని శివనాగిరెడ్డి అన్నారు.

కోడూరుకు వెయ్యేళ్ల చరిత్ర
కోడూరులోని శిల్పాలను పరిశీలిస్తున్న పురావస్తు పరిశోధకుడు శివ నాగిరెడ్డి

- పురావస్తు పరిశోధకుడు ఈమని శివ నాగిరెడ్డి


మహబూబ్‌నగర్‌ రూరల్‌, అక్టోబరు 23 : మండలంలోని కోడూరు గ్రామా నికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని, ఇక్కడ లభ్యమవుతున్న శిల్పాలే అందుకు సాక్షాలని పురావస్తు పరిశోధకుడు, ప్లచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈ మని శివనాగిరెడ్డి అన్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌ గౌడ్‌ సలహామేరకు శనివారం ఆయన మండలంలోని కోడూరు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద గల నాగదేవతా శిల్పాలు, సతీ శిల్పాలు, కోట బురుజులు, గుండం తదితర చారిత్రక ఆనవాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిల్పాలు, ఇ క్కడి నిర్మాణాలన్నీ కందూరు చోళుల కాలానికి చెందినవిగా పేర్కొన్నారు. 1100 సంవత్సరాల చరిత్ర వీటికి ఉందని, కందూరు చోళుల రాజధాని అని,  యువ రాజు నివాసంగా కోడూరు కనిపిస్తోందని, మరింత పరిశోధనతో ఇది వెల్లడ వుతుందని అభిప్రాయపడ్డారు. కోడూరు చారిత్రక నేపథ్యం, ఇక్కడి శిల్పాలు, బురుజులు, తదితర ఆనవాళ్లపై ఒక పుస్తకం తీసుకురావాలని జిల్లా గ్రంథా లయ సంస్థ రాజేశ్వర్‌గౌడ్‌ కోరారు. ఈ సందర్భంగా ఈ విలువైన చరిత్రను కాపాడాలని సర్పంచ్‌ శ్రీకాంత్‌గౌడ్‌కు శివనాగిరెడ్డి సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ నరసింహులు, మన్యంకొండ పాలకమండలి సభ్యుడు చిన్నయ్యగౌడ్‌, సింగిల్‌విండో డైరక్టర్‌ కృష్నయ్య, అంజయ్యగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:06:09+05:30 IST