కనీస వేతన చట్టం అమలు చేయాలి

Jul 27 2021 @ 23:16PM
వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

కాగజ్‌నగర్‌ టౌన్‌: షెడ్యూల్డ్‌ పరిశ్రమల కార్మికుల వేతనాలు కనీస వేతన చట్టం ప్రకారం చెల్లించాలని కాగజ్‌నగర్‌ అసిస్టెంట్‌ లేబర్‌ అధికారిణి మజరున్సీసాకు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్‌, లోకేష్‌ మాట్లాడారు.కనీస వేతన జీ.ఒలు సవరించపోవడంతో రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్‌ పరిశ్రమల్లో పని చేస్తున్న వేలాది మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 15 సంవత్సరాలుగా ప్రైవేటు రంగాలలో పని చేస్తున్న కోటి మంది కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగులు, కార్మికుల ఇబ్బందులు రెట్టింపయ్యాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న జీఒలను సవరించి కనీస వేతనాలు అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓదెలు, ముంజం శ్రీనివాస్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.  

Follow Us on: