నాడు తప్పిపోయి..

ABN , First Publish Date - 2021-02-28T05:47:12+05:30 IST

మతి స్థిమితం కోల్పోయి అదృశ్యమైన జగ్గయ్యపేట గ్రామానికి చెందిన కోసూరి రామలక్ష్మి ఐదేళ్ల తర్వాత సాధారణ మహిళగా ఇంటికి వచ్చింది.

నాడు తప్పిపోయి..
రామలక్ష్మిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న దృశ్యం

  ఐదేళ్ల తర్వాత స్వగ్రామం చేరుకున్న రామలక్ష్మి 

  ఆనందంలో కుటుంబ సభ్యులు

వేపాడ, ఫిబ్రవరి 27: మతి స్థిమితం కోల్పోయి అదృశ్యమైన జగ్గయ్యపేట గ్రామానికి చెందిన కోసూరి రామలక్ష్మి ఐదేళ్ల తర్వాత సాధారణ మహిళగా ఇంటికి వచ్చింది. పోలీసులు, ఓ స్వచ్ఛంద సంస్థ చొరవతో శనివారం స్వగృహానికి చేరుకుం ది. పూర్తిగా ఆరోగ్యంతో ఉన్న ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనం దపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రామలక్ష్మి మతి స్థిమితం కోల్పోయి కొన్నాళ్ల పాటు అచేతనంగా గ్రామంలో తిరిగేది. ఉన్నట్టుండి ఐదేళ్ల కిందట అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంత వేతికినా జాడ కానరాకపోవడంతో చేసేది లేక ప్రయత్నా లు విరమిం చుకున్నారు. దాదాపు ఆమెను మరచిపోయారు. గమ్యం లేని ఆమె ప్రయాణం మహారాష్ట్ర వరకు సాగింది. అక్కడి పోలీసులు రామలక్ష్మి పరిస్థితిని గమనించి అక్కడే ఉన్న శారదా ఫౌండేషన్‌కు 2019లో అప్పగించారు. ఏడాదిన్నర పాటు ఫౌండేషన్‌ వారు సపర్యలు చేసి వైద్య సేవలు అందించడంతో రామలక్ష్మి మతి స్థిమితం నుంచి బయటప డింది. సాదారణ స్థితికి చేరుకోవ డంతో ఫౌండేషన్‌ వారు ఆమె వివరాల కోసం ఆరా తీశారు. చివరకు స్వగ్రామం తెలుసుకుని శనివారం జగ్గయ్యపేటకు తీసుకు వచ్చి కుటుంబ సభ్యులకు అప్ప గించారు. సాధారణ స్థితికి చేరుకు న్న రామలక్ష్మి అందరినీ గుర్తించ గలగడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. శారదా ఫౌండేషన్‌ వారు నాలుగు నెలలకు సరిపడా మందులు అందించడంతో పాటు మరో రెండేళ్ల పాటు మందులు వాడాలని చెప్పారు. మందులు అయిపోగానే సమాచార మిస్తే ఉచితంగా పంపిస్తామని ఫౌండేషన్‌ ప్రతినిధి ఫర్జానాఅన్వారి తెలిపారు.  రామలక్ష్మి వచ్చిన విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట గ్రామ పెద్దలు వి.శ్రీను, రమణ, రమేష్‌ తదితరులు ముందుకొచ్చి రామలక్ష్మికి ఒంటరి మహిళా పింఛన్‌తో పాటు పక్కా గృహం నిర్మాణం చేపట్టి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 

Updated Date - 2021-02-28T05:47:12+05:30 IST