శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం

ABN , First Publish Date - 2022-05-18T03:42:48+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని, ఇందుకోసం గ్రామాల్లో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు డీసీపీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాలతో మంగళవారం బొప్పారంలో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహించారు. డీసీపీ అఖిల్‌ మహాజన్‌, ఏసీపీ నరేందర్‌ ఆధ్వర్యంలో 50 మంది పోలీసు సిబ్బంది బొప్పారంలో ఇండ్లను సోదాలు చేశారు. వాహన పత్రాలు లేని 19 మోటారు సైకిళ్లు, 2 ఆటోలు, 2 ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. అనంతరం ప్రజలతో సమావేశం నిర్వహించారు.

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం
ప్రజలతో మాట్లాడుతున్న మంచిర్యాల డీసీపీ అఖిల్‌మహాజన్‌

కోటపల్లి, మే 17: శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని, ఇందుకోసం గ్రామాల్లో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు డీసీపీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాలతో మంగళవారం బొప్పారంలో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహించారు.  డీసీపీ అఖిల్‌ మహాజన్‌,  ఏసీపీ నరేందర్‌ ఆధ్వర్యంలో 50 మంది పోలీసు సిబ్బంది బొప్పారంలో ఇండ్లను సోదాలు చేశారు. వాహన పత్రాలు లేని 19 మోటారు సైకిళ్లు, 2 ఆటోలు, 2 ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. అనంతరం ప్రజలతో సమావేశం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ నేరాల నిర్మూలనకు కార్డెన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నామని, ప్రజల రక్షణ, భద్రత కల్పిం చడమే తమ ధ్యేయమన్నారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా, గుడుంబా తయా రీ, బెల్టుషాపుల నిర్వహణ, ఇసుక, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మహిళ లు, యువతులు, చిన్న పిల్లలతో మర్యాదగా ఉం డాలని, వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఆపద సమయంలో డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని, సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్ద న్నారు. సీసీ కెమెరాలను అమర్చుకో వాలని, ఎవరై నా అనుమానాస్పదంగా తిరిగితే  సమాచారం అం దించాలన్నారు. సైబర్‌ మో సాల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరా రు.  గ్రామస్తులు పలు సమస్యలను డీసీపీ దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో మాట్లాడి  పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.  వృద్ధులకు బియ్యం, దుప్పట్లు, యువతకు వాలీ బాల్‌, క్రికెట్‌ కిట్‌లు పంపిణీ చేశారు.  చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, కోటపల్లి, నీల్వాయి ఎస్‌ఐ లు రవికుమార్‌, నరేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-18T03:42:48+05:30 IST