ముందే అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్న మోదీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-26T05:40:45+05:30 IST

దేశంలో తాము చేపడతామన్న అభివృద్ధి లక్ష్యాన్ని నిర్ణీతకాలానికి ముందే అందించి అందరికంటే ముందున్న ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోదీదని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు పేర్కొన్నారు.

ముందే  అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్న మోదీ ప్రభుత్వం
దుబ్బాకలో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు

దుబ్బాక, మే25: దేశంలో తాము చేపడతామన్న అభివృద్ధి లక్ష్యాన్ని నిర్ణీతకాలానికి ముందే  అందించి అందరికంటే ముందున్న ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోదీదని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఈ ఎనిమిదేళ్లలో ఆయన చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జూన్‌ 1నుంచి 14 వరకు ఇంటింటి ప్రచారం చేపడుతామని ఆయన తెలిపారు. బుధవారం దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతీ బీజేపీ కార్యకర్త  జూన్‌ నెలలో 75 గంటలు కార్యక్షేత్రంలో పనిచేయడానికి జాతీయ పార్టీ నిర్ణయించందన్నారు. ప్రతి రోజూ 5గంటల పాటు ప్రఽధాని నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను  ప్రజలకు సవివరంగా చెప్పాలని నిర్ణయించామన్నారు. గత  యూపీఏ 1, యూపిఏ-2 ప్రభుత్వం  పాలసీ పెరాలసీ్‌సతో కునారిల్లిందనీ,  ప్రధాని మోదీ అమోఘమైన పాలనతో ఎనిమిదేళ్లలో ప్రజాసంక్షేమాలతో ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన అధికారం చేపట్టిన  మే 26, 2014లో కరెంటు లేకుండా ఉన్న గ్రామపంచాయతీలకు సంబంధించి ఆయన వివరాలను తెప్పించుకున్నారన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 18వేల గ్రామ పంచాయతీలకు కరెంటు లేదని భారత ప్రధాని గుర్తించినట్టు చెప్పారు. వెయ్యి రోజుల్లో ఈ దేశంలో కరెంటు లేని ఊరు లేకుండా చేస్తామని చెప్పిన ఆయన 9వందల 90 రోజులకే అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పని చేసిన వ్యక్తి కేవలం నరేంద్ర మోదీ మాత్రమేనన్నారు. గతంలో దేశంలో ఉత్తరాది, దక్షిణాది వేర్వేరుగా ఉండి విద్యుత్‌ సంక్షోభాలకు నిలయంగా దేశం ఉండేదన్నారు. దక్షిణాది విద్యుత్‌గ్రిడ్‌, ఉత్తరాది గ్రిడ్‌ను ఏకం చేయడానికి  24 నెలల్లోనే ఉత్తరాది గ్రిడ్‌ను, దక్షిణాది గ్రిడ్‌గా అనుసంధానం చేసిందన్నారు. గరీబీ హఠావో అన్న కాంగ్రెస్‌ పేదవాళ్లను ఊరు చివరకు చేర్చితే,  గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చి, గరీబ్‌ యువజన పేరుతో పేదల కాలనీలను ఊరిలో కలిపిన ప్రభుత్వం తమదేనన్నారు. ప్రతీ నియోజక వర్గంనుంచి 78 మందిని తీసుకుని పని చేయించాలని తమ పార్టీ నిర్ణయించిందనీ, దానికి దుబ్బాక మండలం నుంచి 36 మంది ముందుకు వచ్చి పేరు నమోదు చేసుకున్నారన్నారు. జూన్‌ 1వ తేదీ నుంచి 14వరకు కార్యాచరణలోకి వెళ్తారన్నారు.  దుబ్బాక నియోజకవర్గం నుంచి ముందే సిద్దమయ్యారన్నారు. సమావేశంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి,  నాయకులు అంబటి బాలే్‌షగౌడ్‌, ఎస్‌ఎన్‌చారి, కౌన్సిలర్‌ మల్లారెడ్డి, మచ్చ శ్రీనివాస్‌, చింతసంతోష్‌, వెంకట్‌గౌడ్‌, సుంకుప్రవీణ్‌, భద్రి, తోగుట రవి, రమే్‌షరెడ్డి  జీన్నారు.  

Updated Date - 2022-05-26T05:40:45+05:30 IST