రాక్షసత్వాన్ని రూపుమాపాలి

ABN , First Publish Date - 2020-10-25T05:39:56+05:30 IST

శాంతిని కాపాడుకునే క్రమంలో రాక్షసత్వాన్ని రూపు మాపేందుకు మనుషులంతా ఏకంకావాలని దుష్టశిక్షణ, శిష్టరక్షణ, సమాజపరిరక్షణ అన్నవి పోలీసుల ప్రధాన కర్తవ్యమని ఎస్పీ నారాయణ తెలిపారు.

రాక్షసత్వాన్ని రూపుమాపాలి

వికారాబాద్‌:  శాంతిని కాపాడుకునే క్రమంలో రాక్షసత్వాన్ని రూపు మాపేందుకు మనుషులంతా ఏకంకావాలని దుష్టశిక్షణ, శిష్టరక్షణ, సమాజపరిరక్షణ అన్నవి పోలీసుల ప్రధాన కర్తవ్యమని ఎస్పీ నారాయణ తెలిపారు. శనివారం విజయద దశమిని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో వాహన, ఆయుధ  పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, పోలీసులను జిల్లా ప్రజలు వారి కుటుంబ సభ్యులుగా భావిస్తూ, ఎల్లవేళలా సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీ ఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ అచ్యుతారావు, ఆర్‌ఐ రత్నం, ఆర్‌ఎస్‌ఐ , వాహనాల డ్రైవర్లు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T05:39:56+05:30 IST