మత్స్యకారులకు దొరికిన అత్యంత విలువైన బంగారు నిధి.. దాని విలువ తెలిసి అంతా షాక్.. అదెక్కడుందో తెలుసా..

ABN , First Publish Date - 2021-11-01T00:20:42+05:30 IST

నిధుల వేట గురించి తరచూ వింటూ ఉంటాం. కొందరైతే ఇదే పని పెట్టుకుని.. పురాతన ఆలయాలను కూల్చేస్తుంటారు. చివరకు జైలుపాలవుతుంటారు. కానీ నిధి దొరికిన సందర్భాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఇండోనేషియాలో మాత్రం

మత్స్యకారులకు దొరికిన అత్యంత విలువైన బంగారు నిధి.. దాని విలువ తెలిసి అంతా షాక్.. అదెక్కడుందో తెలుసా..

నిధుల వేట గురించి తరచూ వింటూ ఉంటాం. కొందరైతే ఇదే పని పెట్టుకుని.. పురాతన ఆలయాలను కూల్చేస్తుంటారు. చివరకు జైలుపాలవుతుంటారు. కానీ నిధి దొరికిన సందర్భాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఇండోనేషియాలో మాత్రం మత్స్యకారులు జాక్‌పాట్ కొట్టారు. ఐదేళ్లుగా వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. వారికి దొరికిన బంగారు నిధి.. ప్రపంచంలోనే అత్యంత విలువైన నిధుల్లో ఒకటిగా నిలిచింది. వివరాల్లోకి వెళితే..


ఇండోనేషియా సుమత్రాద్వీపంలోని పాలెంబాంగ్ సమీపంలోని మూసీ నదిపై  క్రీ.శ. 7 నుంచి 13వ శతాబ్ధం వరకు శ్రీ విజయ సామ్రాజ్యం ఉండేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఉన్నట్టుండి ఆ సామ్రాజ్యం కనుమరుగైపోయిందట. దీనికి కారణం మాత్రం ఇప్పటివరకూ ఎవరూ చెప్పలేదు. ఆ సామ్రాజ్యం అప్పట్లో వాటర్ వరల్డ్‌‌గా ప్రసిద్ధి చెందిదని ‘ది గార్డియన్‌’ అనే బ్రిటీష్‌ డైలీ న్యూస్‌ పేపర్‌ నివేదిక చెబుతోంది. నదిపై పడవలు ఏర్పాటు చేసి, వాటిపై  ఇళ్ళు, రాజభవనాలు, దేవాలయాలు నిర్మించారట. రానురాను అవన్నీ నీటిలో మునిగిపోయాయట. అగ్నిపర్వతాలు లేదా వరదల కారణంగా.. ఆ సామ్రాజ్యం కూలిపోయి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోపల పెద్ద ఎత్తున బంగారు నిధి ఉందని అప్పటి నుంచి ప్రచారంలో ఉంది. తర్వాత వాటి గురించి చాలా పరిశోధనలు జరిగినా బయటపడలేదు. 


ఆ నదిలో ప్రస్తుతం పెద్దపెద్ద మొసళ్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా ఐదేళ్లుగా స్థానిక మత్స్యకారులు ప్రాణాలకు తెగించి నిధి కోసం వేట సాగిస్తున్నారు. ఆశ్చర్యంగా ఇటీవల వారి ప్రయత్నాలు ఫలించాయి. ఇతిహాసాల్లో చెప్పినవి కథలు కావని, నిజంగా నిధి ఉందని బయటపడింది. విలువైన రత్నాలు, నాణేలు, బంగారు ఉంగరాలు, కాంస్య గంటలు తదితరాలలో నిండిన నిధిని మత్స్యకారులు కనుగొన్నారు. అలాగే రత్నాలతో అలంకరించిన బుద్ధుని విగ్రహం కూడా బయటపడిందట. దీని విలువ మిలియన్ల పౌండ్లు ఉంటుందని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. దీంతో అప్పట్లో శ్రీవిజయరాజ్యం ఉండేదని ప్రజలు నమ్ముతున్నారు.

Updated Date - 2021-11-01T00:20:42+05:30 IST