డాల్‌హౌస్‌ల అమ్మ!

ABN , First Publish Date - 2021-01-25T07:00:52+05:30 IST

ఒక్కొక్కరూ ఒక్కో రకమైన కల కంటారు. ఆ కలను నిజం చేసుకోవాలనుకుంటారు. అలాగే ఇక్కడ బొమ్మరిల్లు లాంటి డాల్‌ హౌస్‌లతో చిరునవ్వులు చిందిస్తున్న సుప్రియా బాయికెరికార్‌కూ ఒక కల ఉంది.

డాల్‌హౌస్‌ల అమ్మ!

ఒక్కొక్కరూ ఒక్కో రకమైన కల కంటారు. ఆ కలను నిజం చేసుకోవాలనుకుంటారు. అలాగే ఇక్కడ బొమ్మరిల్లు లాంటి డాల్‌ హౌస్‌లతో చిరునవ్వులు చిందిస్తున్న సుప్రియా బాయికెరికార్‌కూ ఒక కల ఉంది. చిన్నారులను మైమరిపించే పర్యావరణహితమైన డాల్‌ హౌస్‌లను రూపొందించాలన్నది ఆ కల. తన కలను నిజం చేసుకునే క్రమంలో సుప్రియ ఏకంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారింది. ఎందరి పసిపిల్లల మనసుల్లోనో ‘ఇష్టమైన బొమ్మ’గా నిలిచింది. 


సుప్రియది ముంబయి. చిన్నతనం నుంచీ అమెకు బొమ్మలంటే ఎంతో ఇష్టం. అందుకే తన పుస్తకాల అలమారాలో బొమ్మల కోసం కొద్దిగా స్థలం ఖాళీ పెట్టుకుని అందులో  తన బొమ్మలను అందంగా అమర్చుకునేది. ఆ బొమ్మలు నిద్రపోవడానికి అని  ఒక డబ్బాను చక్కటి పరుపుగా తయారుచేసి వాటిపై ఆ బొమ్మలను పడుకోబెట్టేది. బోరు కొట్టినపుడు ఆ బొమ్మలను అలమారాలోని మరో మూలకు మార్చేది. అలా తన బొమ్మలను మార్చినపుడల్లా అవి కొత్త ఇంట్లోకి మారినట్టు చిన్నారి సుప్రియ సంబరపడిపోయేది. బొమ్మల మీద ఉన్న ఆ ఇష్టం సుప్రియను పెద్దయ్యాక కూడా వదలలేదు.


పాప కోసం మొదలెట్టి...

 చదువు పూర్తయిన తర్వాత సుప్రియకు పెళ్లైంది. ఒక కూతురు పుట్టింది. ఆ పాప పేరు నీవా. తనకోసం మంచి బొమ్మలు కొనాలని భర్తతో కలిసి ఒకరోజు షాపింగ్‌కు వెళ్లింది. ఎన్ని షాపులు తిరిగినా అక్కడి బొమ్మలు సుప్రియకు నచ్చలేదు. పైగా చాలాచోట్ల చిన్నారుల కోసం ప్లాస్టిక్‌ డాల్‌హౌ్‌సలు మాత్రమే ఉండడం చూసి వాటిని  కొనలేదు. పసిపిల్లలు ఆడుకునే బొమ్మలు పర్యావరణహితంగా ఉండాలన్నది సుప్రియ ఉద్దేశం. ప్లాస్టిక్‌ బొమ్మలతో ఆటలాడుకునే క్రమంలో అవి చిన్నారుల ఆరోగ్యానికి చేటు చేస్తాయి. అందుకే ప్లాస్టిక్‌ బొమ్మలు కాకుండా ఎకోఫ్రెండ్లీ బొమ్మలను పిల్లలకు అందుబాటులోకి తెస్తే బాగుంటుందనిపించింది. పైగా సుప్రియ వృత్తిరీత్యా  కమర్షియల్‌ ఆర్టిస్టు. గ్రాఫిక్‌ డిజైనర్‌ కూడా. 


దాంతో భర్త సహాయంతో ఆమె ‘డాల్‌ హౌస్‌’ కంపెనీకి  శ్రీకారం చుట్టింది. ఎదిగే పిల్లల కోసం వెదురుతో చేసిన డాల్‌ హౌస్‌లు, గరాజ్‌ యూనిట్లు, కన్‌స్ట్రక్షన్‌ సైట్స్‌,   ఫామ్‌హౌ్‌సలు వంటి ఎన్నింటినో ఆమె కంపెనీ  తయారుచేస్తోంది. వీటిని  తయారుచేస్తున్న బృందంలో కార్పెంటర్లు, పెయింటర్లు ఉన్నారు. వీళ్లు సుప్రియ డాల్‌ హౌస్‌ల డిజైనింగ్‌ క్రియేషన్స్‌కు వెదురుతో జీవం పోస్తున్నారు. అవి చిన్నారుల హృదయాలను గెలుచుకున్నాయి. సుప్రియ దగ్గర ముందరే డిజైన్‌ చేసిన స్ట్రక్చర్లు సైతం సిద్ధంగా ఉంటాయి. వాటిల్లో ఒక అంతస్తు ఉన్న ఇళ్ల నుంచి, సాధారణ ఇంటి స్ట్రక్చర్లు, విశాలమైన స్థలంలో అందమైన, కళాత్మకమైన వస్తువులను పెట్టుకునేలాంటి నాలుగు అంగుళాల నుంచి ఆరు అంగుళాల పొడవైన బంగ్లా స్ట్రక్చర్లు కూడా ఉన్నాయి. ప్రతి క్యూబికల్‌లో బార్బీ బొమ్మ ఎత్తులో ఉండే కనీసం రెండు డాల్స్‌ను సులభంగా పెట్టుకోవచ్చు.


ఎందరినో ఆకట్టుకుంటున్నాయి

 సుప్రియ బొమ్మలకు ముంబయిలోనే కాదు దేశమంతటా మంచి గిరాకీ ఉంది. ‘దేశంలోని పలు ప్రాంతాల నుంచి  రకరకాల వెదురు బొమ్మలు, డాల్‌హౌ్‌సల నిర్మాణాల కోసం నిత్యం మాకు ఆర్డర్లు వస్తుంటాయి. కస్టమర్ల నుంచి ఆర్డర్లు అందిన పదిహేను రోజుల్లో  వారికి వాటిని షిప్పింగ్‌ చేస్తాం’ అని సుప్రియ చెప్పారు. డాల్‌హౌ్‌సల తయారీ అనుకున్నంత సులభమేమీ కాదు. దీనిపై మాట్లాడుతూ ‘నిజమైన ఇళ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఇవి ఉంటాయి. వీటిని తయారుచేసేటప్పుడు డాల్‌ హౌస్‌ల పొడవు, వెడల్పుల విషయంలో  అస్సలు రాజీ పడం. అలాగే  కస్టమర్ల ఆలోచనలకు తగ్గట్టుగా వాటిని తయారుచేసి అందజేస్తాం’ అని సుప్రియ అంటారు. సుప్రియ తన డాల్‌ హౌస్‌ల నిర్మాణాలలో  ప్రయోగాలను చేస్తుంటారు. ఇటీవల ఒక క్యూబికల్‌ని డెంటల్‌ క్లినిక్‌గా సుప్రియ డిజైన్‌ చేశారు. దాన్ని చూసి ఎందరో ఆశ్చర్యపోయారు.


ఒక యంగ్‌ గర్ల్‌ కోరిక మేరకు సుప్రియ ఆ క్యూబికల్‌ని డెంటల్‌ క్లినిక్‌గా డిజైన్‌ చేసి ఆ చిన్నారికి అందజేశారు. పెరిగే క్రమంలో తన దంతాలను అందులో ఫిక్స్‌ చేసుకోవాలన్నది ఆ చిన్నారి ఆలోచన! సుప్రియా కూతురైన పదకొండేళ్ల నీవా క్యూబికల్‌ని పుస్తకాల అలమారుగా వాడుకుంటోంది. ఇలా చిన్నారుల సృజనాత్మక ఆలోచనలను సైతం స్వీకరించి వాళ్లు కోరుకుంటున్నట్టుగా వెదురుతో వైవిధ్యమైన డాల్‌హౌ్‌సలను డిజైన్‌ చేసి సుప్రియ అందిస్తోంది. ఇప్పుడు సుప్రియ పిల్లలు ఇష్టపడే బొమ్మలను తయారు చేసిచ్చే ‘డాల్‌ హౌస్‌ అమ్మ’ అయిపోయింది..! అలా తన చిన్ననాటి కలను కూడా సుప్రియ సాకారం చేసుకుంది..!    


భర్త సలహాతో ఫ్యాషన్‌గా ఉండే వుడెన్‌ డాల్‌హౌ్‌సలను రూపొందిస్తే బాగుంటుందని ఆలోచించింది. అలా పాప కోసం మొదలెట్టిన వుడెన్‌ డాల్‌హౌ్‌సల తయారీ కాస్తా సుప్రియను  ఔత్సాహిక పారిశ్రామికవేత్తను చేసింది.


నిజమైన ఇళ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో డాల్‌హౌస్‌లు ఉంటాయి. వీటిని తయారుచేసేటప్పుడు  పొడవు, వెడల్పుల విషయంలో  అస్సలు రాజీ పడం. అలాగే  కస్టమర్ల ఆలోచనలకు తగ్గట్టుగా వాటిని తయారుచేసి అందజేస్తాం.

Updated Date - 2021-01-25T07:00:52+05:30 IST