హంతకులను శిక్షించాలి

ABN , First Publish Date - 2021-02-27T03:37:23+05:30 IST

వామన్‌రావు దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలని బార్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశా రు. శుక్రవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు.

హంతకులను శిక్షించాలి
దిష్టిబొమ్మను దహనం చేస్తున్న న్యాయవాదులు

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 26: వామన్‌రావు దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలని బార్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశా రు. శుక్రవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. అనంతరం ర్యాలీగా తెలంగాణ చౌరస్తా చేరుకుని, ధర్నా చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ ఇసుక, మైనింగ్‌ మాఫియా, అక్రమార్కులు ఒక్కటై వామన్‌రావు దంపతులను హత్య చేశార న్నారు. ఆటవికంగా నడి రోడ్డుపై పట్టపగలు హత్య చేసినా ముఖ్యమంత్రి ఇప్పటివరకు నోరుమెదపక పోవడం విచారకరమన్నారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని, సీబీఐతో జరిపించాలని, బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో నిరసనతు తెలిపి, 9న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, రాజాభాస్కర్‌, ఎన్‌పీ వెంకటేశ్‌, నాగేందర్‌రాజు, శ్రీరామ్‌కుమార్‌, బండా కాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, జనార్దన్‌, బాల్‌రెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T03:37:23+05:30 IST