ఇన్నాళ్లకు వీడిన మమ్మీల మిస్టరీ!

ABN , First Publish Date - 2020-09-13T23:15:09+05:30 IST

ప్రపంచంలోనే ఎన్నో మిస్టరీల్లో మమ్మీల తయారీ ఒక్కటి. ఈజిప్టియన్లు పునర్జన్మను నమ్ముతారు. మరణం తర్వాత ఆత్మ ఉండటానికి..

ఇన్నాళ్లకు వీడిన మమ్మీల మిస్టరీ!

ప్రపంచంలోనే ఎన్నో మిస్టరీల్లో మమ్మీల తయారీ ఒక్కటి.  ఈజిప్టియన్లు పునర్జన్మను నమ్ముతారు. మరణం తర్వాత ఆత్మ ఉండటానికి ఒక దేహం కావాలని వాళ్లు భావిస్తారు. అందుకే చనిపోయిన తర్వాత కూడా మమ్మీల రూపంలో శరీరాన్ని భద్రపరిచడానికి ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడిప్పుడే ఆ చిక్కుముడి వీడుతోంది. ప్రాచీన ఈజిప్ట్‌లో  శవాలు కుల్లిపోకుండా ఉండేందుకు వాడిన పద్ధతులేంటో తెలుస్తున్నాయి. 


ఇటీవలే శాస్త్రవేత్తలు ఓ మమ్మీపై క్షుణ్ణంగా అధ్యయనం జరిపి దాన్ని భద్ర పరిచేందుకు ఉపయోగించిన పదార్థాల జాబితాను కనుగొన్నారు. దీని కోసం క్రీ.శ పూర్వం 3700 నుంచి 3500ల మధ్య కాలానికి చెందిన ఓ మమ్మీపై వివిధ దశల్లో ఫోరెన్సిక్ రసాయన పరీక్షలు జరిపారు. ఆ వివరాలను ఆర్కియాలజికల్ సైన్స్ జనరల్‌లో ప్రచురించారు. ఆ అధ్యయనంలో పాలు పంచుకుంటున్న డాక్టర్ స్టీఫెన్ మాట్లాడుతూ 4 వేల ఏళ్ల పాటు ఈజిప్ట్ మమ్మీలను తయారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన పదార్థాల గుట్టును తాము కనిపెట్టినట్లు చెప్పారు. 


శాస్త్రవేత్తల ప్రకారం మమ్మీల తయారీల కోసం ఉపయోగించిన ప్రధాన పదార్థాలు ఇలా ఉన్నాయి. ఓ మొక్క నుంచి సేకరించిన నూనె, బుల్ రషెస్ అనే మొక్క వేరు నుంచి సేకరించిన తైలం, తుమ్మ చెట్టు నుంచి సేకరించిన సహజ సిద్ధ జిగురు, దేవదానం వృక్షం నుంచి సేకరించిన జిగురు, వీటన్నింటినీ కలపడం ద్వారా ఆ పదార్థానికి బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి వస్తుందని దాని సాయంతో కనీసం కుల్లి పోకుండా ఏళ్ల తరబడి కాపాడి ఉంటారని శాస్త్ర వేత్తలు భావిస్తున్నారు. 

Updated Date - 2020-09-13T23:15:09+05:30 IST