గోళ్లు ఆకర్షణీయంగా..!

ABN , First Publish Date - 2021-01-04T05:30:00+05:30 IST

నాజూకైన చేతులకు గోళ్లు అదనపు అందాన్ని ఇస్తాయి. వాటిని పరిరక్షించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేమిటంటే... నాజూకైన చేతులకు గోళ్లు అదనపు అందాన్ని ఇస్తాయి. వాటిని పరిరక్షించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

గోళ్లు ఆకర్షణీయంగా..!

నాజూకైన చేతులకు గోళ్లు అదనపు అందాన్ని ఇస్తాయి. వాటిని పరిరక్షించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేమిటంటే...


  1.  చేతులను గోరువెచ్చటి నీళ్లతో కడుక్కుంటే గోళ్లు మృదువుగా ఉంటాయి.
  2.  గోళ్లు ఆరోగ్యంగా పెరగడానికి వేళ్ల చిగుళ్లకు ఆర్గాన్‌ ఆయిల్‌ని మాయిశ్చరైజర్‌గా రాసుకోవచ్చు. అంతేకాదు ఈ ఆయిల్‌తో వేలి చిగుళ్లను మసాజ్‌ కూడా చేసుకోవచ్చు.
  3.  పాలు, పాల ఉత్పత్తులను బాగా తీసుకోవడం వల్ల అందులోని కాల్షియం, బయొటిన్‌ గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
  4.  గోళ్లపై పసుపు రంగు కనిపిస్తే వారానికి కనీసం మూడుసార్లు నిమ్మకాయ చెక్కతో గోళ్లపై బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
  5.  ఆలివ్‌ నూనె లేదా  కొబ్బరి నూనెతో రోజు విడిచి రోజు గోళ్లను ఐదు నిమిషాలు మసాజ్‌ చేస్తే మెరుస్తుంటాయి.
  6.  నెయిల్‌ కలర్‌  రిమూవర్‌ వాడేటప్పుడు విటమిన్‌ ఎ, సి, ఇ ఉన్న రిమూవర్‌ని ఉపయోగిస్తే మంచిది.
  7.  జింకు బాగా ఉండే ఆహారపదార్థాలు అంటే గుమ్మడికాయ గింజలు, నువ్వుల గింజలు, ఓట్స్‌ వంటివి  తింటే గోళ్లు చిట్లవు. 
  8.  చేతులు, గోళ్లు, వేళ్ల చిగుళ్లు మృదువుగా ఉండాలంటే గోరువెచ్చటి నూనె రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  9.  తోటపని చేసేటప్పుడు, ఇంటిపని చేసేటప్పుడు చేతులకు తప్పనిసరిగా గ్లోవ్స్‌ వేసుకోవాలి. 
  10.  నెయిల్‌ పాలిష్‌ వేసుకునేవాళ్లు పేరబాన్‌, సల్ఫేట్‌, ఫార్మాల్డిహైడ్‌ వంటి రసాయనాలు లేనివి చూసి కొనుక్కోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గోళ్లు ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

Updated Date - 2021-01-04T05:30:00+05:30 IST