దేశవ్యాప్త బంద్‌ విజయవంతం

Sep 28 2021 @ 00:26AM
బంద్‌లో పాల్గొన్న శివరాం

కందుకూరు, సెప్టెంబరు 27:  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతువ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తలపెట్టిన భారత్‌బంద్‌  సోమవారం కందుకూరు నియోజకవర్గంలో విజయవంతమైంది. టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, బీఎస్పీ  కార్యకర్తలతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు. బంద్‌ నేపథ్యంలో హోటళ్లు, సినిమాహాళ్లు, ఇతర వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. కందుకూరులో జరిగిన కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే దివి.శివరాం ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి బంద్‌ నేపథ్యంలో కార్యాలయాన్ని మూసివేయించారు. ఈ క్రమంలోకొద్దిసేపు కమిషనర్‌గా వాగ్వాదం జరిగింది.  మధ్యాహ్నం సమయంలో కొద్దిసేపు రాస్తారోకో చేశారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు దామా మల్లేశ్వరరావు, కంచర్ల శ్రీకాంత్‌, ఎన్‌వి సుబ్బారావు, నాదెండ్ల రమణ య్య, సీపీఎం నాయకులు ముప్పరాజు కోటయ్య, ఎస్‌ఏ గౌస్‌, జి.వెంకటేశ్వర్లు, మువ్వా కొండయ్య, బీఎస్పీ నాయకుడు గోపిరాజ్‌, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉలవపాడు : భారత్‌బంద్‌లో మండలంలోని టీడీపీ, సీఐటీయూ శ్రేణులు పార్టీ జెండాలతో బీజేపీ పాలనకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించాయి. వ్యాపారులు, బ్యాంకులు, ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీ.శ్రీనివాసులు, ఐఎ్‌ఫటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌.మోహన్‌, టీడీపీ మండల అధ్యక్షుడు రాచగల్లు సుబ్బారావు, రైతు కమిటీ సభ్యుడు దామచర్ల సుబ్బారావు, ఎంపీటీసీ దార్ల యలమందమ్మ, తెలుగు యువత మండల  అధ్యక్షుడు తొట్టెంపూడి మాల్యాద్రి, మర్రిబోయిన శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

గుడ్లూరు : మండలంలో జరిగిన బంద్‌లో టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ కార్యానిర్వాహక కార్యదర్శి చంద్రశేఖర్‌, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గంటెనపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

లింగసముద్రం : బంద్‌ సందర్భంగా టీడీపీ మండల అఽధ్యక్షులు వేముల గోపాలరావు ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో గోపాలరావు, ప్రధాన కార్యదర్శి బొల్లినేని నాగేశ్వరరావులు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని వారు విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడపా నర్సయ్య, అడపా రంగయ్య, ఎ.బాబు, జి.ప్రసాద్‌, ముప్పరాజు వెంకటేశ్వర్లు, కె మాలకొండయ్య, జి వెంకటేశ్వర్లు, బి సురేష్‌, కె కొండపనాయుడు, ఎన్‌ నారాయణ, కె కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

దర్శి : భారత్‌బంద్‌లో భాగంగా నాయకులు దర్శి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలను ఆందోళనకారులు మూసి వేయించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు,  సీపీఎం నేత టి.రంగారావు, సీపీఐ నాయకులు మాడపాకుల రమేష్‌, కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ముండ్లమూరు :  మండల కేంద్రంలో తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయంతో పాటు ఉపాధి, బ్యాంకులు, పోస్టాఫీసు, సచివాలయాలను బంద్‌ నేపథ్యంలో వామపక్ష నాయకులు మూసి వేయించారు. అనంతరం ముండ్లమూరు బస్టాండ్‌ కూడలిలో అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు దీంతో అద్దంకి - దర్శి రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి పోయాయి. కార్యక్రమంలో  సీపీఎం మండల కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనేయులు, సీపీఐ కార్యదర్శి సుంకర అంజిరెడ్డి, గంగినేని సత్యం, రత్నరాజు, గోగుల నారాయణ, ఎర్రయ్య, రమేష్‌, మీరావలి, దాసు, మదను ఉన్నారు.

దొనకొండ : కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల ఉద్యమానికి మందుగా నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది.  కార్యక్రమంలో సీపీఎం నాయకులు చిరుపల్లి.అంజయ్య, కోలా.కిరణ్‌కుమార్‌, జొన్నలగడ్డ.రాజు, దమ్ము.దిలీప్‌, అంజిబాబు, బండారు.శ్రీకాంత్‌, మరికొందరు కార్యకర్తలు పాల్గొన్నారు. 

కురిచేడు: రైతలు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్‌ బంద్‌ కురిచేడులో పాక్షికంగా జరిగింది. ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు యధావిధిగా ప్రారంభం అయ్యాయి. టీడీపీ నాయకులు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు మూసివేయించారు. నాయకులు కాట్రాజు నాగరాజు, కమతం నాగిరెడ్డి, కోటిలింగయ్య, గడ్డం బాలయ్య, గణపర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

తాళ్లూరు :  కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఆమోదించిన చట్టాలను రద్దుచేయాలని సీపీఎం నేత వెల్లంపల్లి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. భారత్‌ బంద్‌లో భాగంగా సోమవారం తాళ్లూరులో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమంలో సుంకర అంజిరెడ్డి, షేక్‌ మీరావలి, గోలి రమణయ్య, నాగేశ్వరరావు, నాగరాజు, మరియదాసు ,మోటార్స్‌ యూనియన్‌ అధ్యక్షులు షేక్‌ మస్తాన్‌ టీడీపీ నాయకులు జొన్నలగడ్డ రమణమ్మ, తెలుగుయువత అధ్యక్షుడు చెన్నారెడ్డి, మహేష్‌, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. 

కనిగిరి: మోడీ నిరకుంశ పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్దమయ్యారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీసీ కేశవరావు, టీడీపీ నాయకులు రాచమల్ల శ్రీనివాసులరెడ్డి అన్నారు. కనిగిరిలో భారత్‌ బంద్‌ సందర్భంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, మానవహారం, ర్యాలీ సోమవారం నిర్వహించారు. రైతులకు నష్టం కలిగేలా కార్పోరేట్‌ కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా నల్ల చట్టాలను తీసుకుని రావడం దుర్మార్గమని వెంటనే ఉపసంహరించు కోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు గుజ్జుల బాలిరెడ్డి, టీడీపీ నాయకుల తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, యూటీఎప్‌ నాయకులు పి.మాలకొండారెడ్డి, ఖాజారహంతుల్లా, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వెలిగండ్ల : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం వెలిగండ్లలో టీడీపీ, సీపీఎం ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. అంబేడ్కర్‌ కూడలి నుంచి ప్రారంభమై ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. అనంతరం స్థానిక బస్టాండ్‌ ఆవరణలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెలిగండ్ల మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మద్దతు ధర, గ్యారెంటీ చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు నాయకుడు ఇంద్రభూపాల్‌రెడ్డి, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు సాల్మన్‌రాజు, కాశయ్య, కేశర రమణారెడ్డి, మహేష్‌, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

సీఎస్‌పురం : రైతాంగ, కార్మిక చట్టాలు బిల్లుల రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సోమవారం నిర్వహించిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. స్థానిక బస్టాండ్‌ కూడలిలో పలువురు టీడీపీ, వామపక్షాల బంద్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటేశ్వర్లు, తిరుపతిరెడ్డి, జ్ఞాన్‌రాజ్‌, రత్నారెడ్డి, రాజు, నారాయణ, పోలయ్య, టీడీపీ నాయకులు రామకృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.

పామూరు : ప్రధాని మోడీ దళారులకు దళపతిగా వ్యవహరిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌డీ హనీఫ్‌ ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దుచేయాలని కోరుతూ.. రైతుసంఘాలు, కార్మిక సంఘాలతో జరిగిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రజలు కూడా బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించారు. ఈ సందర్భంగా స్థానిక మమ్మీడాడీ కూడలిలో హనీఫ్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ సవరణ చట్టాని రద్దు చేసి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.