నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-07-02T06:30:52+05:30 IST

నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ-2022)ను వెంటనే రద్దుచేసి ప్రభుత్వపాఠశాలలను కాపాడాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశా రు.

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న యూటిఎఫ్‌ నాయకులు

 పాఠశాలల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి 

 యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి 

నల్లగొండ టౌన్‌, జూలై 1: నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ-2022)ను వెంటనే రద్దుచేసి ప్రభుత్వపాఠశాలలను కాపాడాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశా రు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్టీఎ్‌ఫవై ఇచ్చిన పిలుపు మేరకు టీఎ్‌సయూటీఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎ్‌సను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టాలన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నూతన నియామకాలు జరిగేవరకూ ప్రస్తుతం ఉన్నఖాళీల్లో తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలని, పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సి బ్బందిని నియమించాలన్నారు. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడిచినా పాఠ్యపుస్తకాలు అం దక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం స కాలంలో అందజేయాలని డిమాండ్‌చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి హా జరై సంఘీభావం తెలిపారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌ పరిపాలన అధికారి మోతీలాల్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి, జిల్లా అధ్యక్షుడు సైదులు,ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు బక్క శ్రీనివాసచారి, అరుణ, కోశాధికారి శేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు రాజశేఖర్‌, శ్రీనివా్‌సరెడ్డి, అరుణ, గ్యేర నర్సింహరాజు, వై.శ్రీను, రమాదేవి, నలపరాజు వెంకన్న, నాగిరెడ్డి, ఉపేందర్‌, పాల్వాయి అంజిరెడ్డి, రాంబాబు పాల్గొన్నారు.   

Updated Date - 2022-07-02T06:30:52+05:30 IST