
హైదరాబాద్: యోగి సంక్షేమ పాలన చూసే ప్రజలు ఓటేశారని బీజేపీ నేత బండి సంజయ్ తెలిపారు. యూపీ, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యత కనబర్చింది. దాదాపుగా ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. బీజేపీ విజయఢంకా మోగించడంతో కాషాయ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాసంక్షేమ పాలన రావాలని ఆకాంక్షించారు. కేంద్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని, కేంద్ర నిధులను వాడుకోవడం లేదని తప్పుబట్టారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని సంజయ్ జోస్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి