నామినేషన్ల సందడి

ABN , First Publish Date - 2021-02-23T05:24:05+05:30 IST

రంగు రంగుల జండాలు.. డప్పు చప్పుళ్లు.. మైకుల హోరు.. కళాకారుల విన్యాసాలు.. జై.. జైజై అంటూ నినాదాలు.. భారీ ర్యాలీల నడుమ వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి పలువురు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నల్లగొండ జిల్లా కేంద్రంలో నామినేషన్ల కోలాహలం నెలకొంది.

నామినేషన్ల సందడి
బీజేపీ ర్యాలీ

రంగు రంగుల జండాలు.. డప్పు చప్పుళ్లు.. మైకుల హోరు.. కళాకారుల విన్యాసాలు.. జై.. జైజై అంటూ నినాదాలు.. భారీ ర్యాలీల నడుమ వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి పలువురు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నల్లగొండ జిల్లా కేంద్రంలో నామినేషన్ల కోలాహలం నెలకొంది. నామినేషన్ల చివరి గడువు దగ్గరపడటం, సోమవారం మంచి రోజు కావడంతో ఒక్కరోజే 18నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 48కి చేరింది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, యువ తెలంగాణ పార్టీ తరుఫున గోగుల రాణిరుద్రమరెడ్డి, టీజేఎస్‌ చైర్మన్‌ కోదండరామ్‌, తెలంగాణ ఇంటి పార్టీ అఽఽధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌కు అందజేశారు. వీరితోపాటు ఇండియన్‌ యువతరం పార్టీ తరఫున కోర్లకంటి ప్రకాష్‌రావు, నేషన్‌ యువ తెలంగాణ పార్టీ తరుపున వింజపూరి రాధాకృష్ణ నామినేషన్లు వేశారు. డీఎ్‌సపీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిగల దుర్గాప్రసాద్‌ మహారాజ్‌ నామినేషన్‌వేయగా, వామపక్షాల అభ్యర్థి జయసారధిరెడ్డి తరఫున ప్రతిపాదకులు నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సూదగాని హరిశంకర్‌గౌడ్‌, ముదుడ్ల రమేష్‌, మండపూడి శివప్రసా ద్‌,పెంట రమేష్‌, సంకేపల్లి శ్రీనివా్‌సరెడ్డి, కొండా రాధాకృష్ణ, మామిడి అంబేద్కర్‌, గద్దల అప్పారావు, భారతీ కూరాకుల, కౌతం రవీందర్‌, పాటి రవీందర్‌, కామే రవి, కోళ్లు నరసింహారావు నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారం చివరి రోజు కావడంతో అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


నిరుద్యోగ సమస్యపై పల్లా గల్లా పట్టాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

రామగిరి: నిరుద్యోగ సమస్యపై పల్లాను గల్లా పట్టి నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గా ప్రేమేందర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా సోమవారం నిర్వహించిన భారీ ర్యాలీ, సన్నాహక సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌కు సోడా కలపడానికే తప్ప దేనికీ పనికిరాడన్నారు. సీఎంకు గులాంగిరీ చేస్తూ ఫాంహౌస్‌ చుట్టూ తిరగడం తప్ప ఏమీ చేయలేడన్నారు. గతంలో ఎమ్మెల్సీగా గెలిచాక ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో, ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కబ్జాలకు పాల్పడుతున్న పల్లాను ఓడించాలన్నారు. ఫీజుల రూపంలో కోట్ల రూపాయలు దండుకున్న పల్లా ఓ బ్రోకర్‌ అన్నారు. పల్లాను గెలిపించడం టీఆర్‌ఎ్‌సలోనే కొంతమందికి ఇష్టం లేదన్నారు. బీజేపీని గెలిపిస్తే ఉద్యోగులకు పీఆర్సీ ఎందుకు రాదో చూస్తామన్నారు. కార్యక్రమంలో ధర్మారావు, మోత్కుపల్లి నర్సింహులు, రవీంద్ర నాయక్‌, బంగారు శృతి, కంకణాల శ్రీధర్‌రెడ్డి, నూకల నరసింహారెడ్డి, గొంగిడి మనోహర్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు.


ప్రశ్నించే గొంతుకనవుతా : చెరుకు సుధాకర్‌

పట్టభద్రులు తనకు ఆవకాశం కల్పిస్తే వారి సమస్యల పరిష్కారానికి శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకనవుతానని చెరుకు సుధాకర్‌ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి రెండో సెట్‌ నామినేషన్‌ను సోమవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో బహుజన ఉద్యమ నాయకుడిని గెలిపించాలని, లేదంటే అస్థిత్వమే దెబ్బతింటుందన్నారు. నిరుద్యోగుల్లో దాగిఉన్న కసిని బ్యాలెట్‌ ద్వారా తీర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో చెరుకు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి : కోదండరాం

నల్లగొండ టౌన్‌: రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్‌ వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏఉద్యోగాల కోసమైతే తెలంగాణ ఏర్పడిందో, నిరుద్యోగుల ఆ కాంక్షల మేరకు నోటిఫికేషన్లు విడుదల కాకపోగా, నిరసనగా ర్యాలీ తీ స్తే అనుమతించకపోవడం హేయమన్నారు. రాష్ట్రంలో న్యాయసమ్మతమైన డిమాండ్లు సాధించుకునే వెసులుబాటులేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు భూకబ్జాలు, ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారన్నారు. వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకుడు రంగారావు, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి, బుమ్రుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

Updated Date - 2021-02-23T05:24:05+05:30 IST