తగ్గని ఉధృతి

ABN , First Publish Date - 2020-08-06T06:27:01+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. జిల్లావ్యాప్తంగా 41 మందికి వ్యాధి సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం తన బులెటిన్‌లో ప్రకటించింది

తగ్గని ఉధృతి

4న 41 మందికి కరోనా

జిల్లాలో 1,918కి చేరిన కోవిడ్‌ బాధితులు

5న కూడా 100కు పైగానే పాజిటివ్‌ కేసులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. జిల్లావ్యాప్తంగా 41 మందికి వ్యాధి సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం తన బులెటిన్‌లో ప్రకటించింది. జిల్లాలో కోవిడ్‌ బారిన పడ్డ వారి సంఖ్య 1,918కి చేరింది. చాలా మంది కొవిడ్‌ లక్షణాలు కలిగిన వారు ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోకుండా నేరుగా ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లి స్కానింగ్‌ చేయించుకొని ఇళ్లలోనే మందులు వాడుతున్నట్లు తెలిసింది. ఇలా హోం ఐసోలేషన్‌లో ఉండే వారి సంఖ్య మరో 500 మందికిపైగానే ఉంటుందని చర్చించుకుంటున్నారు. 


బుధవారం స్థానికుల సమాచారం మేరకు జిల్లాలోని వివిధ మండలాల్లో 59 మందికి, కరీంనగర్‌లో దాదాపు 40 మందికిపైగా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం. కరీంనగర్‌ చైతన్యపురిలో ఒకరికి, విద్యానగర్‌లోని ఒకే కుటుంబంలో నలుగురికి, విద్యానగర్‌ పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌లో పనిచేసే కూలీలు ఆరుగురికి, సప్తగిరికాలనీలో ఇద్దరికి, సుభాష్‌నగర్‌లో ముగ్గురికి, బుట్టిరాజారాంకాలనీలో ఇద్దరికి, సాయినగర్‌లో ఒకరికి, విద్యారణ్యపురిలో ఒకరికి, గణేశ్‌నగర్‌లో ఒకరికి, రాంచంద్రాపూర్‌కాలనీలో ఒకరికి, రేకుర్తి హనుమాన్‌నగర్‌లో ఒకరికి, సీతారాంపూర్‌లో ఇద్దరికి, భగత్‌నగర్‌లో ముగ్గురికి కరోనా వ్యాధి సోకినట్లు తెలిసింది.


కాపువాడలో ముగ్గురికి, పద్మశాలివీధిలో ఒక్కరికి, కెఎస్‌ గార్డెన్‌ సమీపంలో ముగ్గురికి, లక్ష్మీనగర్‌లో ఒకరికి, పాతబజారులో ఒకరికి, గాయత్రీనగర్‌లో ఒకరికి, మారుతీనగర్‌లో ఒకరికి, జ్యోతినగర్‌లో ఒకరికి, హౌసింగ్‌బోర్డుకాలనీలో ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. హుజూరాబాద్‌లో 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. జమ్మికుంట మండలంలో 17, వీణవంకలో ఇద్దరికి,  తిమ్మాపూర్‌లో ఒకరికి, కొత్తపల్లిలో ఇద్దరి, కరీంనగర్‌రూరల్‌లో ఒకరికి, మానకొండూర్‌లో 10, ఇల్లందకుంట ఆరుగురికి, గంగాధర నలుగురికి, శంకరపట్నం మండలంలో ఒకరికి కరోనా సోకినట్లు తెలిసింది.

Updated Date - 2020-08-06T06:27:01+05:30 IST