ఆ కార్యాలయం నర్సాపూర్‌లోనే ఉండాలి

ABN , First Publish Date - 2021-03-06T05:47:49+05:30 IST

నర్సాపూర్‌ మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం వాడివేడిగా సాగింది. ఎంపీపీ జ్యోతిసురే్‌షనాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీటీసీలు ఆంజనేయులుగౌడ్‌, శ్రీనివా్‌సగుప్తా మాట్లాడుతూ నర్సాపూర్‌లో ఉండాల్సిన నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయాన్ని దౌల్తాబాద్‌కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఆ కార్యాలయం నర్సాపూర్‌లోనే ఉండాలి
సమస్యలపై అధికారులను నిలదీస్తున్న సర్పంచులు

నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయాన్ని తరలించొద్దని సభ్యుల తీర్మానం

పలు సమస్యలపై వాడివేడి చర్చ

నర్సాపూర్‌ ఎంపీపీ జ్యోతి అధ్యక్షతనమండల సర్వసభ్య సమావేశం


నర్సాపూర్‌, మార్చి 5: నర్సాపూర్‌ మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం వాడివేడిగా సాగింది. ఎంపీపీ జ్యోతిసురే్‌షనాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీటీసీలు ఆంజనేయులుగౌడ్‌, శ్రీనివా్‌సగుప్తా మాట్లాడుతూ నర్సాపూర్‌లో ఉండాల్సిన నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయాన్ని దౌల్తాబాద్‌కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ కార్యాలయం నర్సాపూర్‌లోనే ఉండాలని, అందుకు ఈ సమావేశం తీర్మానం చేయాలని ప్రతిపాదించగా సభ్యులందరూ ఆమోదం తెలిపారు. కాగా.. గ్రామపంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్ల ట్రాలీలు, నీటిట్యాంకులను పూర్తిగా నాణ్యత లేనివి ఇచ్చారని పలువురు సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ శాఖ అధికారులు గ్రామాలలో పనులు సకాలంలో చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఫోన్‌ చేస్తే కూడా స్పందించడం లేదన్నారు. విద్యుత్‌ సమస్యలపై ఎన్నిసార్లు మండల సమావేశంలో చర్చించినా ఫలితం లేదని సర్పంచులు శ్రీశైలంయాదవ్‌, జీతెందర్‌రెడ్డి, వెంకటలక్ష్మి, ఉమ్లానాయక్‌ తదితరులు ఆరోపించారు. అన్యాక్రాంతమవుతున్న మండల పరిషత్‌కు చెందిన భూములను కాపాడాలని ఎంపీటీసీ ఆంజనేయులుగౌడ్‌ సభ దృష్టికి తెచ్చారు. మండల సర్వసభ్య సమావేశానికి ఆయా శాఖల అధికారులు హాజరుకాకపోవడంపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి జడ్పీటీసీ బబియానాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, ఎంపీపీ ఉపాధ్యక్షుడు నర్సింగ్‌రావు, పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు హాజరయ్యారు.

Updated Date - 2021-03-06T05:47:49+05:30 IST