అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

Jul 30 2021 @ 00:20AM
హన్మక్క మృతదేహం

జగిత్యాల రూరల్‌, జూలై 29 : జగిత్యాల రూరల్‌ మండలంలోని వెల్దుర్ది గ్రామంలో బిరుదుల హన్మ క్క (65) అనే వృద్ధురాలు బుధవారం అర్ధరాత్రి అను మానాస్పద స్థితిలో మృతి చెందింది. డ్రైనేజీలో హన్మ క్క మృతదేహం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. రూరల్‌ సీఐ కృష్ణ కుమార్‌, ఎస్సై చిరంజీవి తమ సిబ్బందితో కలిసి సం ఘటన జరిగిన స్థలాన్ని పరీశీలించారు. ఇది హత్య నా లేక ప్రమాదవశాత్తు మృతి చెంది ఉంటుందా అ నే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలు డ్రైనే జీలో పడి వీపు వెనుక భాగంలో గాయాలు కలిగి ఉండడంతో హత్యకు గురైందని భావిస్తున్నారు. అదే కోణంలో విచారిస్తున్నారు. హన్మక్క  భర్త గతంలోనే చనిపోవడంతో గ్రామంలో ఒంటరిగా నివాసం ఉం టోంది. హన్మక్క గ్రామంలో వడ్డీ వ్యాపారం నిర్వహి స్తూ ఉంటుంది. వడ్డీ వ్యాపారం నిర్వహిస్తుండంతో  గిట్టని వారు హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో కొంత మం ది గంజాయికి బానిసలుగా మారారని తెలుస్తోంది. గంజాయి మత్తులో ఎవరైన హత్యకు పాల్పడ్డారా తె లియాల్సి ఉంది. ఆరు నెలల క్రితం ధరూర్‌ గ్రామం లో గంజాయి మత్తులో ఓ హత్య జరిగిందని గ్రామ స్థులు తెలిపారు. రూరల్‌ పోలీసులు అనుమానితుల ను విచారిస్తున్నట్లు తెలిపారు. 

హన్మక్క గురించి తెలిసినవారే హత్యకు పాల్పడ్డా రా, మరెవరైనా బయట వ్యక్తులు హత్యకు పాల్ప డ్డా రా తెలియాల్సి ఉంది. వడ్డీ వ్యాపారి కావడంతో లా వాదేవీలకు సంబంధించిన కోణంలో ఎవరైనా హత్య కు పాల్పడి ఉంటారా అనే కోణంలో సైతం పోలీసు లు విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మృతురాలి కుమా రుడు లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

Follow Us on: