Advertisement

ఒక్కటైన ప్రేమజంట

Apr 23 2021 @ 01:18AM

మొయునాబాద్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి): బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ పెళ్లితో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌ శివార్లలోని జ్వాల నివాసంలో వీరి వివాహం గురువారం జరిగింది. వధూవరుల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.