బహిరంగ సభను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-06-29T05:55:23+05:30 IST

హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జూలై 3న నిర్వహించే మోదీ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఉపా ధ్యక్షుడు సోమ్‌శేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

బహిరంగ సభను విజయవంతం చేయాలి
మాగనూరు సమావేశంలో మాట్లాడుతున్న సోమ శేఖర్‌గౌడ్‌

మక్తల్‌ రూరల్‌, జూన్‌ 28 : హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జూలై 3న నిర్వహించే మోదీ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఉపా ధ్యక్షుడు సోమ్‌శేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు. బీజేపీ మక్తల్‌ రూరల్‌ మండల శాఖ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు చిట్యాల లక్ష్మణ్‌ అధ్యక్షతన శక్తి కేంద్రాల ఇన్‌ చార్జిలు, బూత్‌ కమిటీ అధ్యక్షుల సమావేశాన్ని మంగళవారం వల్లభాపురం దత్తాత్రేయస్వామి ఆలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు విద్యాసాగర్‌, జిల్లా కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, మోహన్‌గౌడ్‌, సర్పంచు గడ్డం రమేష్‌, మండల ప్రధాన కార్యదర్శి వన్నవాడ శ్రీకాంత్‌, ఖతల్‌హుస్సేన్‌, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, బూత్‌ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

మాగనూరు : బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని ఆ పార్టీ జి ల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్‌, ఎంపీ పీ శ్యామలమ్మ పేర్కొన్నారు. మంగళవా రం మండల కేంద్రంలోని లక్ష్మి నరసిం హ్మ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శక్తి కేంద్రాల ఇన్‌చార్జిల సమావే శానికి వారు హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనుల గురించి గ్రామాల్లో ఇం టింటికీ తిరిగి ప్రజలకు తెలియజేయాలన్నారు. మాగనూరు, కృష్ణ మం డలాధ్యక్షులు జయనందరెడ్డి, శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు విద్యాసాగర్‌, జిల్లా నాయకులు సురేష్‌, ఓబీసీ జిల్లా నాయకుడు మల్లేష్‌, ఓబులాపూర్‌ సర్పంచు నారాయణ, అశోక్‌గౌడ్‌, నర్సప్ప, తాయప్పగౌడ్‌ పాల్గొన్నారు.

ధన్వాడ : హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా నాయకుడు రాంచంద్రయ్య, కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జట్రం గోవర్ధన్‌గౌడ్‌ కోరారు. జూలై 3న జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడం కోసం బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ధన్వాడ మండలం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలన్నారు.

Updated Date - 2022-06-29T05:55:23+05:30 IST