అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-07-07T04:49:26+05:30 IST

అందివచ్చిన అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని ఎస్పీసురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని పంగిడిమాదర గ్రామంలో జిల్లా పోలీసులు, వసుధ స్వచ్ఛందసంస్థ ఆర్థిక సాయంతో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్న జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌

- ఎస్పీ సురేష్‌కుమార్‌

తిర్యాణి, జూలై 6: అందివచ్చిన అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని ఎస్పీసురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని పంగిడిమాదర గ్రామంలో జిల్లా పోలీసులు, వసుధ స్వచ్ఛందసంస్థ ఆర్థిక సాయంతో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా ప్రతిమహిళా స్వయంఉపాధి పొంది తనకాళ్లపై తాను నిలబడాల న్నారు. అనంతరం యువతకు వాలీబాల్‌ కిట్లను, వృద్ధులకు వాకర్స్‌ను పంపిణీచేశారు. ఎవరైనా గంజా యి సాగుచేస్తే వారికి ప్రభుత్వ పథకాలు రద్దు అవు తాయన్నారు. పోలీసుశాఖ నుంచి కఠినచర్యలు తీసు కుంటామన్నారు. అనంతరం మండలంలోని చింతల మాదర జలపాతంను సందర్శించి పర్యవేక్షక సిబ్బం దికి పలుజాగ్రత్తలు సూచించారు. ఏఎస్పీ అచ్చేశ్వర్‌ రావు, డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ నరేందర్‌, ఎస్సై రమేష్‌, సర్పంచ్‌జంగు, ఎంపీటీసీ కేశవరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T04:49:26+05:30 IST