అగ్రవర్ణాల పాలనలో అణగారిన వర్గాల అణిచివేత

ABN , First Publish Date - 2020-11-30T05:03:13+05:30 IST

రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు మేలు జరుగుతుం దని, నీళ్లు, నియామకాలు జరుగుతాయని ఆశిస్తే తెలంగాణ వచ్చాక అగ్ర వర్ణాల పాలనలో అణగారిన వర్గాల ప్రజలు అణిచివేతకు గురి అవుతున్నా రని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌ అన్నా రు.

అగ్రవర్ణాల పాలనలో అణగారిన వర్గాల అణిచివేత
కొండగట్టు ఆలయం వద్ద ఎంఎస్‌పీ నాయకులు

మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్‌గౌడ్‌

మల్యాల, నవంబరు 29: రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు మేలు జరుగుతుం దని, నీళ్లు, నియామకాలు జరుగుతాయని ఆశిస్తే తెలంగాణ వచ్చాక అగ్ర వర్ణాల పాలనలో అణగారిన వర్గాల ప్రజలు అణిచివేతకు గురి అవుతున్నా రని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌ అన్నా రు. ఆదివారం కొండగట్టులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అగ్రకుల పాలనలో అణగారిన వర్గాలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ, పారిశ్రామి కం ఇంకా అనేక రంగాలలో వెనుకబడి పోయాయన్నారు. ఈ వెనుకబా టుకు కారణాలు వెలికితీసి సామాజిక న్యాయం కల్పించడానికి పేదల పక్షా న మహజన సోషలిస్టు పార్టీ పోరాడుతుందని, దానికి ప్రజలంద రూ తమ తో కలిసిరావలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ జనాభా దమాషా ప్రకారం ఎవరి వాటా వారు పొందెవిధంగా పోరాడుదామన్నారు. ఈ కార్య క్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బండపెల్లి రాజయ్య, ఎమ్మార్పీ ఎస్‌ జిల్లా ఇన్‌చార్జీ దుమాల గంగారాం, పడిగెల మల్లయ్య, కట్కూరి కరు ణాకర్‌, భాస్కర్‌, శ్రీనివాస్‌, సురుగు శ్రీనివాస్‌, మారంపెల్లి లక్ష్మన్‌, రాజేం ధర్‌, ఎల్లయ్య, రాజన్నలు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T05:03:13+05:30 IST