నక్క అతి తెలివి!

ABN , First Publish Date - 2021-05-02T05:30:00+05:30 IST

వేటగాడు అడవిలో ఉచ్చు ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఆ ఉచ్చులో ఒక నక్క తోక ఇరుక్కుపోయింది. అందులో నుంచి బయటపడటానికి నక్క తోకను బలంగా లాగడం మొదలుపెట్టింది...

నక్క అతి తెలివి!

వేటగాడు అడవిలో ఉచ్చు ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఆ ఉచ్చులో ఒక నక్క తోక ఇరుక్కుపోయింది. అందులో నుంచి బయటపడటానికి నక్క తోకను బలంగా లాగడం మొదలుపెట్టింది. ఎలాగైనా సరే ఉచ్చులో నుంచి తోకను బయటకు తీసుకోవాలనే ఉద్దేశంతో బలంగా లాగింది. దాంతో తోక తెగిపోయింది. తోక తెగిన బాధ కన్నా, ఇతర నక్కలు నవ్వుతాయనే బాధ ఎక్కువయింది. తోక లేని నక్క అంటూ హేళన చేస్తారని, నవ్వుకుంటారని అనుకుంది. అప్పుడే నక్కకు ఒక ఆలోచన తట్టింది. ఆ అడవిలో ఉన్న నక్కలన్నింటిని పిలిచి ‘‘మనకు అవసరం లేని తోకను కత్తిరించుకుందాం. తోక ఉండటం వల్ల శత్రువులకు సులభంగా దొరికిపోతున్నాం. ఇక మనకు తోక అవసరంలేదు’’ అని అంది. ఆ మాటలు విన్న ఓ నక్క ‘‘నువ్వు తోకను పోగొట్టుకున్నంత మాత్రాన మమ్మల్ని తోకలు కత్తిరించుకొమ్మని అంటావా?’’ అంటూ చీవాట్లు పెట్టింది. ఆ మాటలను మిగతా నక్కలన్నీ సమర్ధించాయి. దాంతో తోకను పోగొట్టుకున్న నక్క తలవంచుకుని వెళ్లిపోయింది. 

Updated Date - 2021-05-02T05:30:00+05:30 IST