మున్సిపల్‌ అధికారుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-01-22T06:04:02+05:30 IST

రాష్ట్రంలో దేవాలయాల, ప్రార్థనా మందిరాల భద్రత, పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంటే హిందూపురంలో మాత్రం మున్సిపల్‌ శాఖ అధికారుల అత్యుత్సాహం తీరు వివాదాస్పదంగా మారింది.

మున్సిపల్‌ అధికారుల అత్యుత్సాహం
అధికారులను నిలదీస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

అష్టలక్ష్మి ఆలయ కాంప్లెక్స్‌ నిర్మాణాల తొలగింపునకు యత్నం

 కమిటీ సభ్యులు ఆందోళనతో తగ్గిన అధికారులు

 పురంలో టెన్షన్‌.. టెన్షన్‌


హిందూపురం, జనవరి 21: రాష్ట్రంలో దేవాలయాల, ప్రార్థనా మందిరాల భద్రత, పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంటే హిందూపురంలో మాత్రం మున్సిపల్‌ శాఖ అధికారుల అత్యుత్సాహం తీరు వివాదాస్పదంగా మారింది. ఇందుకు గురువారం  పట్టణంలోని లేపాక్షి ప్రధాన రహదారి డీబీ కాలనీ వద్ద అష్టలక్ష్మి ఆలయ గదుల నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నం చేయడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రెండేళ్ల కిందట నుంచి పట్టణంలో లేపాక్షి రహదారిలో డీబీ కాలనీలో అష్టలక్ష్మి ఆలయం పునర్‌ నిర్మాణంతోపాటు కొంతభాగాన్ని గదుల నిర్మాణం పనులు తుది దశకు వచ్చాయి. ఈనేపథ్యంలో మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పోలీస్‌ బందోబస్తుతో గురువారం మధ్యాహ్నం  ఆలయం వద్దకు చేరుకుని అనుమతి లేకుండా కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడుతున్నారని తొలగించేందుకు ప్రయత్నం చేశారు. ఈవిషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులతోపాటు భక్తులు భారీగా చేరుకున్నారు. ఆలయ స్థలంలోనే నిర్మాణాలు చేపడుతున్నామని ఎలా తొలగిస్తారని నిలదీశారు. మున్సిపల్‌ టౌన్‌ ప్లాన్‌ ప్రకారం 80 అడుగుల రోడ్డు ఉండాలని ఆలయం వద్ద 60 అడుగులే అందని పైగా ఆలయం అనుయతి లేకుండా ఎలా చేపడతారని 20 అడుగల మేర గదుల కట్టడాలని తొలగించాల్సిందేనని అధికారులు పట్టుపట్టారు. చివరకు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు ఆలయం వద్దకు చేరుకుని ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు. కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టలేదని ఉత్సవ విగ్రహాలతోపాటు పూజ సామగ్రిని పెట్టేందుకు గదులు నిర్మాణం చేపడుతున్నట్లు అది కూడా గతంలో ఉన్న ఆల య ప్రహరీ లోపలే నిర్మాణం చేపట్టినట్లు కమిషనర్‌కు కమిటీ సభ్యు లు వివరించారు.

    అయినా మున్సిపల్‌ అనుమతి లేకుండా గదులు ఎలా నిర్మాణం చేపడతారని కమిటీ సభ్యులను కమిషనర్‌ ప్రశ్నించారు. సమస్య తీవ్రతరం కావడంతోపాటు కొందరు బీజేపీ నాయకులు ఆలయం వద్దకు చేరుకోగానే రాజకీయ అంశంగా మారుతుందన్న భావించిన మున్సిపల్‌ అధికారులు కమిటీ సభ్యులకు సర్దిచెప్పి వెనుదిరిగారు. ఈవిషయం హిందూపురంలో అధికార పార్టీలోని ఓ ప్రజాప్రతినిధి వద్దకు సమాచారం వెళ్లడంతో వైసీపీ నాయకులను ఆయం వద్దకు పంపించి తామే సమస్య పరిష్కరించినట్లుగా సర్థిచెప్పే ప్రయత్నం చేయడం చర్చంశనీయంగా మారింది. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు స్పందిస్తూ అష్టలక్ష్మి ఆలయం ఎదుట అనుమతుల్లేకుండా కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడుతున్నట్లు ఫిర్యాదులపై పరిశీలించామన్నారు. 


Updated Date - 2021-01-22T06:04:02+05:30 IST