Tank మూతపై రాయి పెట్టాడు.. చివరకు కోతి చేష్టల వల్ల ఎంత ఘోరం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-06T23:55:37+05:30 IST

ఢిల్లీలోని నబికరీం ప్రాతంలో ఓం ప్రకాశ్ మిశ్రా నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి పైకి కోతులు రోజూ వచ్చి వస్తువలన్నింటినీ చెల్లాచెదురు చేసేవి. నీళ్ల ట్యాంక్ మూతను పీకేసి, రచ్చరచ్చ చేస్తుండడంతో విసిగిపోయాడు. ఓ రోజు ట్యాంక్‌ మూతపై రాళ్లు పెట్టాడు.

Tank మూతపై రాయి పెట్టాడు.. చివరకు కోతి చేష్టల వల్ల ఎంత ఘోరం జరిగిందంటే..

కోతి చేష్టలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. ఇంటి ఆవరణలో, పైన ఏ వస్తువులు ఉన్నా చెల్లాచెదురు చేస్తుంటాయి. ఒక్కోసారి వీటి ఆగడాలు భరించలేనంతంగా ఉంటాయి. ఇలాగే ఇంటి పైన ఉన్న ట్యాంక్ మూతను కోతులు పదే పదే పీకేస్తుండడంతో.. ఓ యజమాని దానిపై రాయి పెట్టాడు. అయితే ఓ కోతి చేసిన నిర్వాకానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 


ఢిల్లీలోని నబికరీం ప్రాతంలో ఓం ప్రకాశ్ మిశ్రా నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి పైకి కోతులు రోజూ వచ్చి వస్తువలన్నింటినీ చెల్లాచెదురు చేసేవి. నీళ్ల ట్యాంక్ మూతను పీకేసి, రచ్చరచ్చ చేస్తుండడంతో విసిగిపోయాడు. ఓ రోజు ట్యాంక్‌ మూతపై రాళ్లు పెట్టాడు. ఇక సమస్య ఉండదులే అనుకున్నాడు. అయితే కోతులు మాత్రం రోజూ వచ్చేవి. ఓ రోజు ట్యాంక్‌పై ఉన్న రాయిని కోతులు తీసి కింద పడేశాయి. అదే సమయంలో కింద ఉన్న మహ్మద్ కుర్బాన్‌పై పడింది. తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడు. ముందు విషయం అర్థం కాకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 


అనంతర విచారణలో ఇంటి ఓనర్ అసలు విషయం చెప్పాడు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు.. ఇంటి యజమాని ఓం ప్రకాశ్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. కోతి కారణంగా మనిషి చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో.. చెప్పలేం అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-10-06T23:55:37+05:30 IST