పరేడ్‌ గ్రౌండ్‌ మే సవాల్‌

ABN , First Publish Date - 2022-07-06T08:51:42+05:30 IST

‘‘పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ సభతో మోదీ కోటా అయిపోయింది. ఇక టీఆర్‌ఎ్‌సను సభ నిర్వహించమనండి.

పరేడ్‌ గ్రౌండ్‌ మే సవాల్‌

ఎవరి శక్తి ఎంతో తేల్చుకుందాం: రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘‘పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ సభతో మోదీ కోటా అయిపోయింది. ఇక టీఆర్‌ఎ్‌సను సభ నిర్వహించమనండి. ఆ తర్వాత మేము రాహుల్‌గాంధీతో కాంగ్రెస్‌ సభను నిర్వహిస్తాం. అదే పరేడ్‌ గ్రౌండ్‌లో అనుమతించాలి. ఎవరి శక్తి ఏమిటో తెలుస్తుంది. ఎవరి వెనుక తెలంగాణ సమాజం ఉందో స్పష్టమవుతుంది’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఏఐసీసీ ప్రఽధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రా జకీయ పరిస్థితులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రభావం, పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తాను పీసీసీ అధ్యక్షుడిగానియమితుడయ్యాక ఈ ఏడాది కాలంలో రాష్ట్రం లో వివిధ సమస్యలపై జరిపిన పోరాటాల గురించి వేణుగోపాల్‌కు వివరించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలను, సోనియాగాంధీ నాయకత్వాన్ని నమ్మి పార్టీలో చేరాలనుకునే నాయకుల వివరాలను వేణుగోపాల్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పార్టీలో ఇతర పార్టీల నేత చేరికల పట్ల వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని రేవంత్‌ అన్నారు. చేరికల అంశాన్ని కొన్నిసా ర్లు ముందే ప్రకటిస్తే.. అధికార పార్టీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారిపై కేసులు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తోందని, అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.


మోదీకి అనుకూలమైతేనే బీఆర్‌ఎస్‌...

ప్రధాని మోదీకి ఉపయోగపడుతుందని అనుకుంటే నే బీఆర్‌ఎస్‌ అనే పార్టీని కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తారని, మోదీకి నష్టం జరుగుతుందంటే దానిని ముం దుకు తీసుకెళ్లరని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కచ్చితంగా గెలుస్తారని నిర్ధారణకు వచ్చిన తరువాతే ప్రతిపక్షాల అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ మద్ద తు ప్రకటించిందని ఆరోపించారు. ఇందులోనే ప్రధాని మోదీ అనుకూల విధానం అందరికీ అర్థమైందన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎ్‌సతో పోరాడటమే తమ ముందున్న కార్యాచరణ అని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని అధికారంలో ఉంచి ప్రతిపక్షాల స్ధానాన్ని బీజేపీ ఆక్రమించిందని, తెలంగాణలో నూ అదే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాత్మకంగా కేసీఆర్‌ను అధికారంలో ఉం చుతూ కాంగ్రెస్‌, ఇతర పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చే సి ఆ స్థానాన్ని బీజేపీకి అప్పగించే పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌ పరిణామాలను తెలంగాణలో జరగనివ్వబోమని, ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు మూడోసారి అవకాశంరాదని, టీఆర్‌ఎ్‌సను గద్దె దించు తామని ప్రకటించారు. జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్‌రెడ్డి తనను, మల్లు భట్టివిక్రమార్కను, ఇత ర నేతలందరినీ భోజనానికి ఆహ్వానించారని, తాము ఢిల్లీలో ఉండడం వల్ల హాజరుకాలేక పోయామని చె ప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్టీ బలోపేతంపై అందరినీ ఆహ్వానించారని, త్వరలోనే 10-15 వేల మం ది కార్యకర్తలను కూడా ఆహ్వానించి సమావేశాన్ని ని ర్వహిస్తానని విష్ణు చెప్పారని వెల్లడించారు. విష్ణు  సమావేశానికి పీసీసీ అనుమతి ఉందన్నారు. 


మున్ముందు భారీగా చేరికలు..

వివిధ జిల్లాల నుంచి కాంగ్రె్‌సలో చేరే నేతల గురించి, ఎవరెవరిని ఎప్పుడు చేర్చుకోవాలన్న అంశాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని, టీఆర్‌ఎస్‌ పాలనతో విసిగిపోయి, భవిష్యత్తు లేదన్న ఆలోచనతో తెలంగాణపై అభిమానం ఉన్నవాంతా తమ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. పాత నాయకులకు ఇబ్బంది లేకుండానే కొత్తవారిని చేర్చుకుంటున్నామని అన్నారు. అయితే కాంగ్రె్‌సను నిలబెట్టిన పాతవారిని పణంగా పెట్టబోమని స్పష్టం చేశారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో విభజన హామీల గురించి ప్రధాని మోదీ మాట్లాడలేదని, సీఎం కేసీఆర్‌ కూడా వాటి గురించి ప్రశ్నించలేదని విమర్శించారు. బహిరంగ సభలో కేసీఆర్‌ పేరును కూడా మోదీ ప్రస్తావించకపోవడం వారి మధ్య అవగాహన ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి ఆడుతున్న నాటకానికి తెరదించి ప్రజలకు వాస్తవాలు చెబుతామని అన్నారు. కాగా, పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయని, వాటిని బేధాభిప్రాయాలుగా భావించకూడదని భట్టి  విక్రమార్క చెప్పారు. పార్టీలో సమస్యలను అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకుంటామన్నారు. 

Updated Date - 2022-07-06T08:51:42+05:30 IST