Great Wall of Chinaయేకాదు.. ఈ దేశ పార్లమెంట్ బిల్డింగ్‌ను కూడా చంద్రుడిపై నుంచి చూడొచ్చు!

ABN , First Publish Date - 2022-03-19T21:06:16+05:30 IST

అంతరిక్షం నుంచి చూసినా భూమిపై కనిపించే మానవ నిర్మితం ఏది? అని ఎవరైనా అడిగితే.. క్షణం కూడా ఆలోచించం. ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ అని ఠక్కున సమాధానం చెప్పేస్తాం. కానీ చంద్రుడిపై నుంచి కూ

Great Wall of Chinaయేకాదు.. ఈ దేశ పార్లమెంట్ బిల్డింగ్‌ను కూడా చంద్రుడిపై నుంచి చూడొచ్చు!

ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్షం నుంచి చూసినా భూమిపై కనిపించే మానవ నిర్మితం ఏది? అని ఎవరైనా అడిగితే.. క్షణం కూడా ఆలోచించం. ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ అని ఠక్కున సమాధానం చెప్పేస్తాం. కానీ చంద్రుడిపై నుంచి కూడా ఓ దేశానికి చెందిన పార్లమెంట్‌ను చూడొచ్చని చాలా మందికి తెలియదు. అంత పెద్ద పార్లమెంట్ భవనం ఏ దేశంలో ఉందని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి. 



రొమానియా రాజధాని బుకారెస్ట్‌లో ఉన్న ఆ దేశ పార్లమెంట్ బిల్డింగ్ ప్రపంచంలోని అతిపెద్ద భవనాలలో ఒకటి. 86 మీటర్ల ఎత్తైన ఈ భవనాన్ని.. 3.65లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. భవనంలోపల 23 వేర్వేరు విభాగాలు ఉన్నాయి. రొమానియా చివరి నియంత నికోలా చాచెస్కూ.. సుమారు మూడు ట్రిలియన్ల రూపాయలు వెచ్చించి మరీ ఈ బిల్డింగ్‌ను కట్టించాడు. ఈ భవన నిర్మాణంలో దాదాపు రెండు మిలియన్ల మంది కార్మికులు పని చేశారట. ఈ భవన నిర్మాణం వల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో.. నికోలా చాచెస్కూ‌పై ప్రజలు తిరగబడ్డినట్టు సమాచారం. చంద్రుడిపై నుంచి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కనిపించినట్లే.. రొమానియా పార్లమెంట్ బిల్డింగ్ కూడా కనిపిస్తుదట.  




Updated Date - 2022-03-19T21:06:16+05:30 IST