పే స్కేల్‌ జీవోను విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-07-01T05:23:58+05:30 IST

వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్‌ జీవోను వెంటనే విడుదల చేయాలని వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల బాలయ్య డిమాండ్‌ చేశారు

పే స్కేల్‌ జీవోను విడుదల చేయాలి
కోహెడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు

 వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలయ్య డిమాండ్‌


చిన్నకోడూరు, జూన్‌ 30: వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్‌ జీవోను వెంటనే విడుదల చేయాలని వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల బాలయ్య డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం మండల వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో చిన్నకోడూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన వీఆర్‌ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని, 55 సంవత్సరాల వయస్సు పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్ధార్‌ శ్రీనివా్‌సరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండల వీఆర్‌ఏల సంఘం నాయకులు పోచయ్య, మల్లేశం, శ్రీనివాస్‌, కృష్ణ, లక్ష్మీనారాయణ, లింగం, నర్సింలు, నరేష్‌, స్వామి, శ్రావణ్‌, రవీందర్‌, రాజలింగం, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.


కోహెడ, కొండపాకలో వీఆర్‌ఏల నిరసన


కోహెడ/కొండపాక, జూన్‌ 30: ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కోహెడ తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు ప్లకార్డులతో నిరసనకు దిగారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు దానవేన శ్రీనివాస్‌, మండల వీఆర్‌ఏలు పాల్గొన్నారు. కొండపాక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.బాలనర్సయ్య, తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కార్యదర్శి మిద్దె కృష్ణమూర్తి, మండల నాయకులు తుపార్ల సత్తయ్య, మన్నె ఇస్తారు, మ్యాడ కనకయ్య, ఎన్‌.లింగం ఎ.పోశయ్య, కనకయ్య, కనకలక్ష్మి, పోషవ్వ, వెంకటవ్వ, రమేష్‌, యాదగిరి, మల్లేశం పాల్గొన్నారు.


 

Updated Date - 2022-07-01T05:23:58+05:30 IST