పీహెచ్‌సీని శుభ్రం చేయించాలి

ABN , First Publish Date - 2021-04-23T05:04:24+05:30 IST

పీహెచ్‌సీని శుభ్రం చేయించాలి

పీహెచ్‌సీని శుభ్రం చేయించాలి
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ

కీసర: కరోనా వైరస్‌ పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మండల పరిషత్‌లో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ గ్రామానికి ఇద్దరి చొప్పున సిబ్బందిని మండల ఆరోగ్య కేంద్రానికి పంపించి దాన్ని శుభ్రం చేయించాలన్నారు. మే1 నుంచి 18సంవత్సరాలు నిండిన వారికి అందరికీ టీకాలు వేస్తారని తెలిపారు. యాద్గార్‌పల్లిలో కేటాయించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు విద్యుత్‌ మీటర్లు లేవని,  లబ్ధిదారులు విద్యుత్‌ చోర్యానికి పాల్పడుతున్నారని, వారిపై కేసులు నమోదు చేస్తామని ఏఈ బాల్‌రాజ్‌ తెలిపారు. ఉపాధి కూలీలకు కావాల్సినంత పనులు ఉన్నాయని ఇన్‌చార్జ్‌ అర్పిత తెలిపారు. త్వరలో గోధుమకుంట, కీసరలో చెరువులు పూడికతీత పనులు చేస్తామన్నారు. కీసర, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో మద్యం దుకాణాల పర్మిట్‌ రూంలతో పారిశుధ్యం లోపిప్తోందని కీసర సర్పంచ్‌ మాధురి, అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ కవిత అధికారుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీడీవో పద్మావతి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:04:24+05:30 IST