ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా

ABN , First Publish Date - 2021-07-23T05:24:31+05:30 IST

పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు నిరసనగా టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్పీ భంజ్‌దేవ్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గురువారం టీడీపీ శ్రేణులు రాస్తారోకో, నిరసన చేపట్టాయి.

ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా
సాలూరులో జాతీయ రహదారిపై మోకాలిపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు

మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి

సాలూరు రూరల్‌, జూలై 22: పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు నిరసనగా టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్పీ భంజ్‌దేవ్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గురువారం టీడీపీ శ్రేణులు రాస్తారోకో, నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నిత్యావసరాలు, గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగ, కార్మిక, కర్షక, కూలీలు జగన్‌రెడ్డి పాలనలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని ఆరోపించారు. పాలన ఘోరంగా తయారైందంటూ ధ్వజమెత్తారు. భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రం పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, టీడీపీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-23T05:24:31+05:30 IST