నేరుగా స్టేషన్‌కు వచ్చి.. వెక్కి వెక్కి ఏడుస్తూ 15 ఏళ్ల బాలిక చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఇంటికి వెళ్లి చూస్తే..

Published: Fri, 22 Jul 2022 16:52:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేరుగా స్టేషన్‌కు వచ్చి.. వెక్కి వెక్కి ఏడుస్తూ 15 ఏళ్ల బాలిక చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఇంటికి వెళ్లి చూస్తే..

11వ తరగతి చదువుతున్న ఓ బాలిక సడన్‌గా ఓ రోజు ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆమెను గమనించిన వారంతా ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించారేమో.. లేదా ఇంకెవరైనా డబ్బులు దొంగతనం చేసుంటారేమో.. అని అనుకున్నారు. పోలీసులు కూడా ముందు అలాగే అనుకున్నారు. చివరకు ఆమె చెప్పింది విని అంతా నివ్వెరపోయారు. చివరకు బాలిక ఇంటికి వెళ్లిన వారికి.. సమస్య పూర్తిగా అర్థమైంది. కుటుంబ పరిస్థితిపై బాలికకు ఉన్న అవగాహన చూసి.. అంతా శభాష్ అని మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నేరుగా స్టేషన్‌కు వచ్చి.. వెక్కి వెక్కి ఏడుస్తూ 15 ఏళ్ల బాలిక చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఇంటికి వెళ్లి చూస్తే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ పరిధి  కిద్వాయ్ మొహల్లా ప్రాంతంలో నివాసం ఉండే సుభాష్‌కు భార్య, ఐదు మంది పిల్లలు ఉన్నారు. తల్లి గృహిణి కాగా.. సుభాష్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడి కుమార్తె 15ఏళ్ల రౌనక్ అనే బాలిక.. ప్రస్తుతం 11వ తరగతి చదువుతోంది. ఈమెకు ఇద్దరు అక్కలు, ఓ అన్న, 12 ఏళ్ల చెల్లెలు ఉన్నారు. వీరి ఇంట్లో రెండు చిన్న గదులు మాత్రమే ఉంటాయి. అందులోనే ఏడు మంది ఉండడంతో పాటూ పక్కనే పశువులకు కూడా ఆశ్రయం ఏర్పాటు చేశారు. సుభాష్ రోజూ పని చేస్తేనే గానీ వీరి కుటుంబం గడవదు. అయినా ఎలాగోలా కష్టపడుతూ పిల్లలను చదివించుకుంటున్నారు. తల్లిదండ్రులు పడే కష్టాన్ని రౌనక్ రోజూ గమనిస్తూ ఉండేది. చిన్న వయసు నుంచే తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తూనే, మరోవైపు చదువు కూడా కొనసాగించేది.

ఒక్క రోజు సెలవు ఇవ్వలేదనే కారణంతో.. లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ.. ఇంతకీ ఆమె సమస్య ఏంటంటే..

ఇదిలావుండగా, జూలై 13న రౌనక్ తమ ఇంటికి సమీపంలో ఓ బుక్ డిపోలో  ఫిజిక్స్ పుస్తకాన్ని రూ. 850కి కొనుగోలు చేసింది. మరుసటి రోజు స్కూల్‌కి వెళ్లిన ఆమె.. పుస్తకాన్ని తన స్నేహితులకు చూపించింది. అయితే అదే పుస్తకాన్ని తాము కేవలం రూ.765కే కొన్నామని సహ విద్యార్థులు తెలిపారు. దీంతో రౌనక్ ఈ విషయంపై తీవ్రంగా ఆలోచించింది. మరుసటి రోజు బుక్ డిపోకి వెళ్లి దీనిపై యజమానిని నిలదీసింది. అయితే అతడు మాత్రం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. డబ్బులు వెనక్కు ఇవ్వనని తెగేసి చెప్పాడు.

Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..

తమది పేద కుటుంబమని, ప్రతి రూపాయీ తమకు చాలా విలువైనదని.. దయచేసి డబ్బులు వెనక్కు ఇవ్వాలని వేడుకుంది. అయినా ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను వెంట పెట్టుకుని గ్రామానికి వచ్చి విచారించారు. వారి ఆర్థిక పరిస్థితిని చూసి చలించిపోయారు. ‘‘సీఎం యోగి ప్రభుత్వం మంచి పని చేస్తోందదని వార్తాపత్రికలలో చదివాను. వినియోగదారుల హక్కుల గురించి నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’’.. అని బాలిక చెప్పడంతో పోలీసులతో పాటూ స్థానికులంతా ఆశ్చర్యపోయారు. చివరగా ఆమెను అంతా అభినందించారు.

Sad incident: ఇలాంటి వైద్యులను ఏమనాలి.. పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణి పరిస్థితి చివరకు ఏమైందంటే..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

భర్తపై కోర్టులో కేసు వేసేందుకు డబ్బులు అవసరమని.. మేనమామ ఇంటికి వెళ్లిన ఆమె.. చివరకు ఏం చేసిందంటే.. పీటలపై వరుడు.. ఎంతకూ పెళ్లి మంటపానికి చేరుకోని వధువు.. ఫోన్ చేస్తే అసలు నిజం తెలిసి షాక్.. చివరకు ఊహించని సీన్..!రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడనుకున్న పోలీసులు.. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం ఒకరిపై డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!చీకటి గదిలో నాలుగేళ్లుగా ఆ భార్యకు నరకం.. మలమూత్రాల మధ్య జీవనం.. గది తలుపులు తీస్తే కనిపించిన దృశ్యం చూసి..బస్టాండ్‌లో ఉండగా లిప్‌స్టిక్‌ అడిగిన భార్య.. సరేనని షాపునకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చేసరికి షాకింగ్ ట్విస్ట్.. అసలు కథేంటంటే..సెలవు రోజు కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన యువతి.. లోపలికి వెళ్లాక యజమాని ఒక్కడే ఉండడంతో షాక్.. చివరకు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.