రోడ్డు ప్రమాదంలోనే ఈ కుర్రాడు చనిపోయాడని పోలీసులు కూడా ఫిక్సయ్యారు.. ఐదో రోజు బయటపడిన ఒక్క వీడియోతో సీన్ రివర్స్..

ABN , First Publish Date - 2021-12-22T01:29:36+05:30 IST

‘‘మీ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు’’.. అని.. మృతుడి తల్లిదండ్రులకు ముగ్గురు యువకులు ఫోన్ చేశారు. వారు చెప్పింది చివరకు పోలీసులు కూడా నమ్మారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కేసు నమోదు చేశారు. ఇందులో..

రోడ్డు ప్రమాదంలోనే ఈ కుర్రాడు చనిపోయాడని పోలీసులు కూడా ఫిక్సయ్యారు.. ఐదో రోజు బయటపడిన ఒక్క వీడియోతో సీన్ రివర్స్..
రాహుల్ (ఫైల్)

‘‘మీ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు’’.. అని.. మృతుడి తల్లిదండ్రులకు ముగ్గురు యువకులు ఫోన్ చేశారు. వారు చెప్పింది చివరకు పోలీసులు కూడా నమ్మారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కేసు నమోదు చేశారు. ఇందులో ఎవరికీ ఏ అనుమానాలూ లేవనుకుంటున్న సమయంలో ఐదో రోజు ఓ వీడియో బయటపడింది. దీంతో ఆ యువకుడు చనిపోవడానికి గల అసలు కారణాలు తెలిశాయి. సంచలనం కలిగించిన ఈ కేసు వివరాల్లోకి వెళితే..


పోలీసుల కథనం మేరకు.. హర్యానాలోని పల్వాల్‌ ఖతేలా గ్రామానికి చెందిన చిడ్డీ అనే వ్యక్తికి రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. డిసెంబర్ 14న రసూల్‌పూర్ అనే గ్రామంలో వివాహ కార్యక్రమం ఉండడంతో బైకుపై వెళ్లాడు. ఈ క్రమంలో హసన్‌పూర్‌‌లో తన పాత మిత్రులైన కలువ, విశాల్‌‌ను కలిశాడు. ముగ్గురూ కలిసి ఊరి బయటికి వెళ్లి మద్యం సేవించారు. ఆ సమయంలో కలువకు చెందిన ఫోన్ పడిపోయింది. దీన్ని చూసిన రాహుల్.. తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఫోన్ కోసం కలువ, విశాల్ వెతుకుతున్నారు. తర్వాత అనుమానం వచ్చి రాహుల్ జేబులో వెతకగా బయటపడింది. దీంతో అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటూ దాడి చేశారు. అనంతరం రాహుల్‌ను కలువ ఇంట్లో రాత్రంతా బంధించారు.

బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!


మరుసటి రోజు పొద్దున కలువ, విశాల్.. దిల్జాలే అనే మిత్రుడితో కలిసి రాహుల్‌ను ఊరి బయటికి తీసుకెళ్లి తీవ్రంగా దాడి చేశారు. దీన్నంతా దిల్జాలే వీడియో తీశాడు. మృతి చెందిన రాహుల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత రాహుల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ‘‘మీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఆస్పత్రిలో చేర్పించాము.. అయితే చికిత్స పొందుతూ చనిపోయాడు’’..అని చెప్పారు. దీంతో రాహుల్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లే కేసు నమోదు చేశారు. అయితే తర్వాత అనుమానం కలగడంతో కలువ, విశాల్, దిల్జాలేను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దిల్జాలే ఫోన్‌ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. వారిని సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను పంపించి.. అత్తారింట్లో మొదటిరోజే ఈ కొత్త పెళ్లికూతురి నిర్వాకానికి..

Updated Date - 2021-12-22T01:29:36+05:30 IST