రైతును చుట్ట్టుముట్టిన రాజకీయం

ABN , First Publish Date - 2020-10-21T05:56:30+05:30 IST

జగిత్యాల జిల్లాలో ఇప్పుడు రైతు చుట్టే రాజకీయం నడుస్తోంది. రైతన్నలకు గిట్టుబాటు ధర లక్పించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌, బీజేపీలు ఆందోళనలకు దిగుతుంటే, రైతు సంక్షేమమే ల క్ష్యం అంటూ టీఆర్‌ఎస్‌ ఎదురుదాడికి దిగింది. చైతన్యానికి మారుపేరైన

రైతును చుట్ట్టుముట్టిన రాజకీయం

అధికార పార్టీపై పెరుగుతున్న ఒత్తిడి 

అన్నదాతలకు మద్దతుగా కాంగ్రెస్‌, బీజేపీ

రైతు సంక్షేమమే లక్ష్యం అంటూ టీఆర్‌ఎస్‌ ఎదురుదాడి


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల) 

 జగిత్యాల జిల్లాలో ఇప్పుడు రైతు చుట్టే రాజకీయం నడుస్తోంది. రైతన్నలకు గిట్టుబాటు ధర లక్పించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌, బీజేపీలు ఆందోళనలకు దిగుతుంటే, రైతు సంక్షేమమే ల క్ష్యం అంటూ టీఆర్‌ఎస్‌ ఎదురుదాడికి దిగింది. చైతన్యానికి మారుపేరైన జగిత్యాల జిల్లా రైతు లు పసుపు, మొక్కజొన్న, వరి పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలంటూ ఆందోళనలు చేశారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐదు రోజుల క్రితం చలో మెట్‌పెల్లికి పిలుపునిచ్చిన రైతులు మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని, సన్నరకం వడ్లకు మద్దతు ధర ప్రకటించాలని, సోయాను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్దఎత్తున ఆందోళన చేశారు. మెట్‌పెల్లిలో ధర్నా చేసిన రైతులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తూ అధికార పార్టీకి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఇంటిపై దాడికి య త్నించారు. ఈ ఘటన జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి పుట్టించింది. అసలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ర్యాలీ తీయడంతో పాటు, ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి చేయడాన్ని టీఆర్‌ఎస్‌ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. 


కాక పుట్టించిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

రాత్రి వరకు తర్జనభర్జనలాడిన పోలీసులు ఎట్టకేలకు ఉన్నతాధికారులు, నేతల ఒత్తిడి మే రకు ఘటనకు బాధ్యులంటూ 18 మందిపై కేసులు పెట్టారు. మరో అడుగు ముందుకేసి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ప్రెస్‌మీట్‌ పెట్టి రైతులను కించపరిచేలాగా మాట్లాడారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు కన్నెర్ర చేశారు. మెట్‌పెల్లి డివిజన్‌తో పాటు, జగిత్యాల డివిజన్‌ పరిధిలోని పలు చోట్ల ఎమ్మెల్యే దిష్టి బొమ్మలను దహనం చేశారు. జగిత్యాలలో జిల్లా పరిషత్‌ సమావేశంలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దృష్టికి విషయం వెళ్లడంతో సమావేశం ముగిసిన వెంటనే మంత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు. ఇలాంటి ఘటనలు జరిగితే చూస్తూ ఊరుకోబోమని పరోక్షంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులను హె చ్చరించారు. అయితే మెట్‌పెల్లిలో అంతపెద్ద ఎత్తున రైతుల ర్యాలీకి ఎలా అనుమతించారనే దా నిపై కూడా పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. జగిత్యాలలో ఎస్పీ, మెట్‌పెల్లి డీఎ స్పీతో ఘటనపై సమీక్షించారు.


ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సూచించిన ట్లు సమాచారం. ఇక్కడితో సమస్య సద్దుమణుగుతుందనుకుంటే మరింత ఆజ్యం పోసినట్లు అ య్యింది. రైతుల పట్ల కోరుట్ల ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగానే సోమవారం తెల్లవా రు జామునే జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులను అరెస్ట్‌ చేసి ఠాణాలకు తరలించారు. మ రోవైపు ఏదైనా అనుకోని ఘటన జరుగుతుందనే అనుమానంతో ముందుచూపుతో కోరుట్ల ఎమ్మె ల్యే ఇంటివద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా కాంగ్రెస్‌ నాయకులు మెట్‌పెల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా పలు చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు అక్కడక్కడ కోరు ట్ల ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దహనం చేస్తూనే ఉన్నారు. దీనికి విరుగుడుగా టీఆర్‌ఎస్‌ ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. కోరుట్ల ఎమ్మెల్యే ఇంటిపై జరిగిన ఘటనను నిరసిస్తూ  టీఆర్‌ ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రెస్‌ మీట్‌లు పెట్టి, పార్టీ ఐక్యతను చాటుతూ, కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలని, అలాగే పార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్పప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచనలు జారీ చేసింది. జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు అటు కాంగ్రెస్‌, బీజేపీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో గత నాలుగైదు రోజులుగా జిల్లాలో రైతుల చుట్టే రాజకీయం చక్కర్లు కొడుతోంది.

Updated Date - 2020-10-21T05:56:30+05:30 IST