పేద రెడ్లను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-05-29T05:08:04+05:30 IST

అగ్రకులంలో పేదరెడ్డి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి పాలమూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

పేద రెడ్లను ఆదుకోవాలి
రెడ్ల సమస్యలపై కలెక్టరేట్‌ ఏవో కిషన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న పాలమూరు రెడ్డి సేవా సమితి నాయకులు

- రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), మే 28 : అగ్రకులంలో పేదరెడ్డి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి పాలమూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కమిటీ సభ్యులు శనివారం కలెక్టరేట్‌ ఏవో కిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తూము ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రెడ్లల్లో అత్యధికులు చదువు కున్నప్పటికీ అనేకమంది దుర్భర జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక ఎన్నో వ్యయప్రయాసాలతో వ్యవసాయ చేస్తే గిట్టుబాటు ధర లభించక కాడి వదిలి రైతు కూలీలుగా మారుతున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఒక అగ్రకులంగానే చూస్తోంది తప్ప వారిని ఆదుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద రెడ్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, అగ్రకుల పేదలకు గురుకులాలు, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని, విదేశీ విద్యకు రూ.20 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి ప్రధాన కార్యదర్శి పోతుల రాఘవరెడ్డి, కోశాధికారి వి. రాజేందర్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రభాకర్‌ రెడ్డి, కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, బి.కిష్టారెడ్డి, జయప్రతాప్‌ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు బి. ఉదయ శ్రీ, వి. వరలక్ష్మి, కరుణాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-29T05:08:04+05:30 IST