టీడీపీలో చేరిన వారితో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్
మదనపల్లె టౌన్, మే 21: రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో వున్నారని చంద్రబాబు పాలన కావాలని కోరుకుంటున్నా రని దీంతో టీడీపీకి ఆదరణ పెరుగుతోందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ పేర్కొన్నారు. శనివారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు భవానిప్రసాద్ ఆధ్వర్యంలో 2వ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. దొమ్మలపాటి మాట్లాడుతూ ప్రజలు మేల్కోవాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే మళ్లీ చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరం వుందన్నారు. అనంతరం చంద్రాకాలనీకి చెందిన 30 మంది టీడీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు యశశ్విరాజ్, సిద్దప్ప, నాగయ్య, వెంకటరమణారెడ్డి, అక్కులప్ప, ఎస్‌ఏ మస్తాన్, రఫి, మధుబాబు, నీలకంఠ, ఎం.రెడ్డిశేఖర్, రాణా కాశీశ్రీరామ్, శ్రీనివాసులు, విజయమ్మ పాల్గొన్నారు.