అశ్లీల బొమ్మను తొలగించాలి

ABN , First Publish Date - 2021-07-27T04:12:54+05:30 IST

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సైన్స్‌ పార్కులో మహిళలను కించ పరిచేలా ఏర్పాటు చేసిన అశ్లీల బొ మ్మను వెంటనే తొలగించాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్‌ చేశారు.

అశ్లీల బొమ్మను తొలగించాలి
అశ్లీల బొమ్మకు చీరకట్టి నిరసన తెలుపుతున్న బీజేపీ జిల్లా మహిళా మోర్చా సభ్యులు

నారాయణపేట, జూలై 26: నారాయణపేట జిల్లా కేంద్రంలోని సైన్స్‌ పార్కులో మహిళలను కించ పరిచేలా ఏర్పాటు చేసిన అశ్లీల బొ మ్మను వెంటనే తొలగించాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్‌ చేశారు. సోమవారం  బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆ బొమ్మకు చీర కట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానసిక ప్రశాంతత కోసం ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చే పార్కులో మహిళలు తలదించుకునేలా అశ్లీల బొమ్మను ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. బొమ్మను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మహిళా  మోర్చా  నాయకురాళ్లు జ్యోతి, సుజాత, రఘురామయ్య, సత్య రఘుపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T04:12:54+05:30 IST