కార్పొరేషన్‌లో ఎల్‌డీసీ పోస్టు రూ.7లక్షలు..!

ABN , First Publish Date - 2022-09-23T05:42:19+05:30 IST

ఒంగోలు నగరపాల క సంస్థలో అధికార వైసీపీ కార్పొరేటర్ల తీరు విమర్శలకు తావి స్తోంది. పరిపాలన సౌలభ్యం పేరుతో ఉద్యోగాల నియామకా లు, సీట్లు మార్పు చేస్తూ లక్షలు వసూలు చేస్తున్నారు.

కార్పొరేషన్‌లో ఎల్‌డీసీ పోస్టు రూ.7లక్షలు..!

చక్రం తిప్పిన వైసీపీ కార్పొరేటర్‌


ఒంగోలు(కార్పొరేషన్‌), సెప్టెంబరు 22: ఒంగోలు నగరపాల క సంస్థలో అధికార వైసీపీ కార్పొరేటర్ల తీరు విమర్శలకు తావి స్తోంది. పరిపాలన సౌలభ్యం పేరుతో ఉద్యోగాల నియామకా లు, సీట్లు మార్పు చేస్తూ లక్షలు వసూలు చేస్తున్నారు. తాజా గా గతంలో ఆర్‌ఐగా పనిచేసిన తాన్‌సేన్‌ అనే ఉద్యోగి అనారో గ్యం కారణంగా తన ఉద్యోగాన్ని తన కొడుకు ఇవ్వాలని దర ఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఆ పని పూర్తి చేయడానికి అక్ష రాల రూ.7లక్షలను డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. ఈ వ్యవ హారంలో కీలకపాత్ర పోషించి చక్రంతిప్పిన ఓ వైసీపీ కార్పొరే టర్‌ తొలుత రూ.10లక్షలు అడిగి, బేరసారాల అనంతరం రూ. 7లక్షలకు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే తండ్రి ఉద్యోగం కొడుకు ఇవ్వడానికి కూడా కార్పొరేషన్‌లో లక్షలు ముడుపులు డిమాండ్‌ చేసిన వ్యవహారం కార్పొరేషన్‌ కార్యాలయంలో చర్చ నీయాంశమైంది. వాస్తవానికి గతంలో ఇక్కడ ఆర్‌ఐగా పని చేసి, మృతిచెందిన మంజులకుమారి కొడుకు తన తల్లి ఉద్యో గం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. సీనియారిటీ ప్రకారం, కారుణ్య నిమాయమకం కింద ఉద్యోగం అతనికే ఇవ్వాల్సి ఉం ది. అయితే ఇక్కడ వైసీపీ కార్పొరేటర్లు నిబంధనలను పక్కన పెట్టి ఆర్‌ఐ తాన్‌సీన్‌ కొడుకుకు ఇచ్చేందుకు ఫైల్‌ను ఆగమే ఘాలపై నడుపుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పాల కవర్గం పెద్దలు ఇటీవల చేతివాటం చూపడంపై నగరమంతా కోడై కూస్తుండగా, ఇటీవల కాలంలో ఏ కార్పొరేషన్‌లో లేనివి ధంగా ఒంగోలుకు ఇద్దరు ఆర్‌ఓలు, 8మంది ఆర్‌ఐలను నియ మించడం కూడా చర్చనీయాంశమైంది. తాజాగా తండ్రి ఉ  ద్యోగం కొడుకు ఇచ్చేందుకు ఎల్‌డీసీ పోస్టుకు రూ.7లక్షలు ప లకడం మరింత విమర్శలకు తావిస్తోంది. పాలకవర్గ పెద్దల ముడుపుల వ్యవహారంలో వైసీపీ కార్పొరేటర్‌ కీలకంగా వ్యవ హరించడంపై అటు కార్యాలయంలోను, ఇటు ఇతర వైసీపీ కార్పొరేటర్లను చర్చనీయాంశమైంది. కాగా గురువారం పోస్టు ను తాన్‌సేన్‌ కుమారుడికి ఇచ్చేసినట్లు సమాచారం.


Updated Date - 2022-09-23T05:42:19+05:30 IST