పీఆర్సీ జీఓ రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-29T05:55:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీ ఆర్సీ జీఓలను వెంటనే రద్దు చేయాలని మున్సిపల్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

పీఆర్సీ జీఓ రద్దు చేయాలి
రాయదుర్గంలో వినతి పత్రాన్ని అందజేస్తున్న మున్సిపల్‌ ఉద్యోగులు

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వినతులు


గుత్తి, జనవరి 28: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీ ఆర్సీ జీఓలను వెంటనే రద్దు చేయాలని మున్సిపల్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కా ర్యాలయంలో  కమిషనర్‌ గంగిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి నెల జీతాలను పాతస్కేల్‌ ప్రకారం ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ ఇమాంహుసేన, శానిటరీ ఇనస్పెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్వో వెంకటరెడ్డి, ఆర్‌ఐ ఎర్రిస్వామి, అకౌంట్స్‌ ఆఫీసర్‌ సు రేంద్ర పాల్గొన్నారు.


పామిడి: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీతాలు కాకుండా పాత జీతాలే ఇవ్వాలని తహసీల్దార్‌ ఆర్వీ సునీతాబాయి, రెవె న్యూ అధికారులు కోరారు. స్థానిక మండల తహసీల్దార్‌ కా ర్యాలయంలో శుక్రవారం కార్యాలయ డీడీఓ ఉదయభాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ నిజాం, ఆర్‌ఐ లత, వీఆర్వో అసోసియేషన  జి ల్లా ప్రధాన కార్యదర్శి బోయ పెద్దన్న, రమేష్‌, శ్రీకాంతరెడ్డి పాల్గొన్నారు.


పాత పెన్షనే అమలు చేయాలి 

కళ్యాణదుర్గం: పాత పెన్షన విధానాన్ని అమలు చే యాలని పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు శివప్రసాద్‌, కార్యద ర్శి తిప్పేస్వామి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రభుత్వ వి ధానాన్ని నిరసిస్తూ సబ్‌ట్రెజరీ అధికారి విమలాదేవికి విన తి పత్రాన్ని అందజేశారు. 2015 వేతన సవరణ కమిటీ ప్రతిపాదించిన పాత పెన్షనను చెల్లించాలని, 2021 జూలై వరకు రావాల్సిన ఐదు డీఏలను పాత పెన్షనకు కలపాల ని, 2022 జనవరి పెన్షన చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెన్షనర్లు అంజినప్ప, నాగరాజు, సీసీరెడ్డి, కృష్ణమూర్తి, భగవానదా్‌స, నరసింహులు పాల్గొన్నారు. 


ఉరవకొండ: పీఆర్సీ చీకటి జీవోను రద్దు చేయాల్సిందేనని, పాత పద్ధతి ప్రకారం పెన్షన ఇవ్వాలని పెన్షనర్స్‌ అ సోసియేషన నాయకులు క్రిష్టప్ప డిమాండ్‌ చేశారు. స్థాని క ట్రెజరీ కార్యాలయం వద్ద పెన్షనర్లు శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం ఎస్టీవో నాగేంద్రకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన నాయకులు వెంకటస్వామి, కుళ్లాయప్ప, సూర్యనారాయణ, చంద్రశేఖర్‌ గౌడ్‌, చెన్నరాయుడు  పాల్గొన్నారు. 


యాడికి: ఉద్యోగులకు పాత వేతనాన్ని కొనసాగించాలని కోరుతూ శుక్రవారం పలువురు రెవెన్యూ సిబ్బంది ఇనచార్జ్‌ తహసీల్దార్‌ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు కీర్తిసాగర్‌, ఆనంద్‌బాబు, ఆచారి, సీనియర్‌ అసిస్టెంట్‌ రాజ్‌కుమార్‌, వీఆర్వోలు శాం తకుమారి, నరసింహులు, కుళ్లాయప్ప, శ్రీధర్‌, నాగన్న, స త్యనారాయణ పాల్గొన్నారు. 


డీ హీరేహాళ్‌: ప్రభుత్వం పాత పీఆర్సీతో కొత్త డీఏల ను కలిపి వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్సీ సా ధన కమిటీ, ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ కార్యాల య సిబ్బంది మృత్యుంజయకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జాఫర్‌, ఉ పాధ్యాయులు ఈరాళప్ప, రాఘవేంద్ర, శశిధర్‌, అలకుందప్ప, శ్వేత, అయ్యన్న, హుస్సేన, కరిష్మా పాల్గొన్నారు. 


కుందుర్పి: కొత్త పీఆర్సీ వద్దు.. పాత పీఆర్సీని అమలు చేయాలని ఎస్‌టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఎస్‌టీయూ స్టేట్‌ కౌన్సిలర్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ కొత్త పీఆర్సీ ప్రకారం ఉపాధ్యాయు లకు జీతాలు చెల్లిస్తే తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. అసంబద్ధమైన పీఆర్సీ జీవోలను రద్దుచేసే వరకు పోరాడు తామన్నారు. కార్యక్రమంలో మండల శాఖ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


తాడిపత్రి టౌన: పాత పీఆర్సీయే కావాలంటూ శుక్రవా రం ఎస్టీఓ కార్యాలయంలో ఎస్టీఓ ఫరూక్‌కు విశ్రాంత ఉ ద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వి శ్రాంత ఉద్యోగి కత్తి లక్ష్మినారాయణరెడ్డి మాట్లాడుతూ పా తపీఆర్సీ ప్రకారం పింఛన ఇవ్వాలని, నూతన పీఆర్సీ మాకు వద్దని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


యల్లనూరు: పాతపద్ధతిలోనే జీతాలు చెల్లించాలని కో రుతూ మండల కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది శు క్రవారం ఎంపీడీఓ ఓబులమ్మకు వినతిపత్రం అందజేశా రు. కొత్త నిబంధనలు అమలుచేయకూడదని సీనియర్‌ అసిస్టెంట్‌ నాగేశ్వరరెడ్డి తెలిపారు. 


రాయదుర్గం: ప్రభుత్వం పాత వేతనాలే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియాకు ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలోనాయకులు రామాంజనేయులు, రామేశ్వరరెడ్డి, ఎం ఎస్‌ నాగభూషణ, రామకృష్ణ, మల్లికార్జున, ఖాజా మోయిద్దీన, సత్యనారాయణ, బాషా, కిషోర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:55:51+05:30 IST