పీఆర్సీ రిపోర్టును వెంటనే బహిర్గతం చేయాలి

ABN , First Publish Date - 2021-01-25T05:52:05+05:30 IST

పీఆర్సీ రిపోర్టును బహిర్గతం చేసి సంఘాలతో చర్చలు జరపాలని, ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎ్‌స యూటీఎ్‌ఫ)రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య డిమాండ్‌ చేశారు.

పీఆర్సీ రిపోర్టును వెంటనే బహిర్గతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జంగయ్య

 టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య డిమాండ్‌


సిద్దిపేట ఎడ్యుకేషన్‌, జనవరి 24: పీఆర్సీ రిపోర్టును బహిర్గతం చేసి సంఘాలతో చర్చలు జరపాలని, ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎ్‌స యూటీఎ్‌ఫ)రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కేటగిరీల వారీగా సీనియారిటీ లిస్టులను ప్రకటిస్తూ ప్రమోషన్‌ షెడ్యూల్‌ విడుదల చేయకుండా ఉపాధ్యాయులను అయోమయంలోకి నెట్టడం సరైంది కాదన్నారు. 2018 జూలై నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదన్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయలని, టీచర్లకు నోషనల్‌ ఇంక్రీమెంట్లు ఇవ్వాలని, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో  జిల్లా అధ్యక్షుడు పి.నగేష్‌, ప్రధాన కార్యదర్శి టి.యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు జి.తిరుపతి జాదవ్‌, బి.నిర్మల, కోశాధికారి ఎం.కృష్ణ, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T05:52:05+05:30 IST