Advertisement

ఉద్యోగులకు పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి

Jan 24 2021 @ 00:36AM
నకిరేకల్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న ఉపాధ్యాయులు

జిల్లావ్యాప్తంగా భోజన విరామ సమయంలో నిరసన
నాంపల్లి / దేవరకొండ / నకిరేకల్‌ / మర్రిగూడ / తిరుమలగిరి(సాగర్‌) / నాంపల్లి / మునుగోడు, జనవరి 23 :
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు శనివారం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందించారు. నాంపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎ్‌స ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ మం డల అధ్యక్షుడు సిలువేరు నారాయణ మాట్లాడుతూ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాని డిమాం డ్‌ చేశారు. దేవరకొండ మండలం పడ్మట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో  మధ్యా హ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపినట్లు ఉపాధ్యాయ ఐక్యవేదిక జల్లా కార్యదర్శి శిరందాసు రాందాస్‌ తెలిపారు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రమోషన్లు, బదిలీల షెడ్యుల్‌ను విడుదల చేయాలని నిరసన తెలిపినట్లు తెలిపారు. నకిరేకల్‌ పట్టణంలో టీఎ్‌సయూటీఎఫ్‌, డీటీఎఫ్‌ ఆధ్వర్యం లో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని టీఎ్‌సయూటీఎఫ్‌ మర్రిగూడ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందించా రు. తమ సమస్యలు పరిష్కరించాలని ఇందిరాపార్కు వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల అరెస్ట్‌ అప్రజాస్వామికమని బీసీటీయూ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాపోలు పరమేష్‌ అన్నారు. తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని  అల్వాల ప్రాథమికోన్నత పాఠశాలలో స్థానిక ఉపాధ్యాయులతో కలిసి మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ ఉపాఽ ద్యాయులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో స్థానిక గడియారం సెంటర్‌లో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు.

Follow Us on:
Advertisement